కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
కామారెడ్డి:50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పేద ప్రజలకు ఆ పార్టీ ఏం చేసిందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారుజిల్లాలోని ఎల్లారెడ్డిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
. తెలంగాణలో రైతులకు మూడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతున్నాడన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉందనే విషయాన్ని రైతులు ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు.తమ ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేస్తుందని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పాలనలో విద్యుత్ కోసం అధికారులను బతిమాలుకున్న పరిస్థితులు మర్చిపోయామా అని ఆయన ప్రశ్నించారు.
undefined
మరోసారి కాంగ్రెస్ కు ఓటేసి మరోసారి మోసపోదామా .. సురేందర్ రెడ్డిని గెలిపించుకుందామా అని ఆయన ప్రశ్నించారు. గత ఎన్నికల్లో సురేందర్ రెడ్డికి 35 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ దఫా 75 వేల ఓట్ల మెజారిటీ వచ్చేలా బాధ్యత తీసుకోవాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.రైతు బంధు కావాలా, రాబందు పాలన కావాలా అని ఆయన ప్రజలను కోరారు.
Watch Live! Minister Sri speaking at a public meeting in Yellareddy https://t.co/bCYgdy0H84
— BRS Party (@BRSparty)బీజేపీ నేతలకు హిందూ, ముస్లిం గొడవ తప్ప మరో అంశం తెలియదని మంత్రి కేటీఆర్ విమర్శించారు.రాష్ట్రంలో అత్యధికంగా రైతు బంధును అందుకుంటున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్లారెడ్డి ఒకటని కేటీఆర్ చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా వరిని పండిస్తున్న ప్రాంతం ఎల్లారెడ్డి ప్రాంతమని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఇందుకు తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలు కారణమన్నారు. ఎల్లారెడ్డిలో రూ. 45 కోట్ల పనులకు మంత్రి జీవోలను ఎమ్మెల్యే సురేందర్ రెడ్డికి అందించారు.