
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదపుతుంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న బలమైన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఒకరు కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి ఆయన మంతనాలు కూడా జరిపినట్టుగా తెలుస్తోంది. వివరాలు.. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కొంతకాలంగా బీఆర్ఎస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన రాను్న అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ విప్‌గా గువ్వల బాలరాజ్.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మరోసారి టికెట్ ఆయనకే దక్కనుందని తెలుస్తోంది. మరోవైపు గువ్వల బాలరాజుకు, రాములుకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఫ్లెక్సీల విషయంలో కూడా ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేని రాములు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీగా కన్నా.. ఎమ్మెల్యేగా ఉంటేనే.. స్థానికంగా తన పట్టు ఉంటుందని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రాములు పార్టీ మారే ఆలోచనకు వచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రహస్యంగా కాంగ్రెస్‌తో ఎంపీ రాములు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కనుగోలు టీమ్ ఆయన టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆయన అచ్చంపేట ఎమ్మెల్యే టికెట్ కోరుతున్నట్టుగా సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ అందుకే అంగీకరిస్తే.. రాములు హస్తం గూటికి చేరడం ఖాయమేనన్న ప్రచారం సాగుతోంది.