
Telangana: తెలంగాణ మంత్రి కేటీఆర్ వివిధ జిల్లాల్లో పర్యటిస్తూనే వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ.. బిజీబిజీగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ-HMDA) పరిధిలోని సరస్సులు, చెరవులు, నీటి వనరుల (lakes and water bodies) పరిస్థితిపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏ అండ్ యూడీ) మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) సమీక్ష నిర్వహించారు. ఈ సరస్సుల రక్షణ, అభివృద్ధి, సుందరీకరణపై సమీక్షలో భాగంగా నిపుణులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మినిస్టర్ కేటీఆర్ (Telangana Minister KTR) మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ-HMDA) కూడా అదే దిశలో వేగంగా పని చేస్తోందని అన్నారు. నగరంలో భూముల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పలు చోట్ల భూములు కబ్జాలకు గురి కావడంతో పాటు అనేక చెరువుల భూములు మాయం అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. చెరువుల సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూములు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చెరవులు, నీటివనరులు, సరస్సు (lakes and water) భూములను కూడా పరిరక్షించాలన్నారు. భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హెచ్‌ఎండీఏ పరిధిలోని గండిపేట వంటి పెద్ద చెరువుల్లో ఇప్పటికే అభివృద్ధి, పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) తెలిపారు. గండిపేట సరస్సు సుందరీకరణ పనులను వేగవంతం చేయడంతో పాటు నగర ప్రజలకు గొప్ప అనుభూతిని అందించేలా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఈ అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలన్నారు. రేడియల్ రోడ్ల పటిష్టత, మూసీ నది పునరుద్ధరణ పనులు, మూసీ నదిపై వంతెనల నిర్మాణం, హెచ్‌ఎండీఏ ల్యాండ్‌పూలింగ్ ప్లాన్, లాజిస్టిక్ పార్కుల నిర్మాణంపై అధికారులతో మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) చర్చించారు.
ఇదిలావుండగా, హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2022లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు వర్చువల్‌గా జరిగే సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రికి ఆహ్వానం అందింది. ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్య వక్తగా హాజరవుతారు. ఫిబ్రవరి 20న సాయంత్రం 6.30 గంటలకు ఆయన ప్రసంగిస్తారు. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ థీమ్ "ఇండియా @ 2030 – ఎ ట్రాన్స్‌ఫార్మేషనల్ డికేడ్". తెలంగాణ సమర్థవంతమైన విధాన రూపకల్పన, వాటి అమలు, ఐటీ ఆధారిత తెలంగాణ వృద్ధి, వ్యాపారాన్ని సులభతరం చేయడం, మహిళా కేంద్రీకృత వ్యాపార ఇంక్యుబేటర్లు, 2030 అభివృద్ధి విజన్‌పై మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) తన ఆలోచనలను పంచుకోనున్నారు. ఈ ఆహ్వానం పట్ల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్.. ఈ సదస్సులో తన ఆలోచనలను పంచుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.