వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనను కూడా రాజకీయం చేయడాన్ని మంత్రి తప్పుబట్టారు.
వరంగల్: ప్రీతి ఘటనపై తెలంగాణ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు స్పందించారు. ప్రీతి ఘటనను రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. తప్పు చేసినవాళ్లు సైఫైనా, సంజయ్ అయినా ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఆయన సోమవారం సభలో అన్నారు. ప్రీతి ఘటనలో నిందితులకు చట్టప్రకారం, న్యాయం ప్రకారం శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.
ప్రీతి కాలేజీ గొడవల్లో మనస్తాపానికి గురై మరణించిందని, దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు.చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రీతి కుటుంబానికి తన తరఫున, ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు. ఇతర పార్టీల నాయకులు ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని గానీ, ప్రీతి కుటుంబానికి అండగా నిలిచేది తామేనని ఆయన చెప్పారు.ప్రతి చిన్న విషయాన్ని కూడా చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
undefined