పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య: మార్చి 6వ తేదీకి తీర్పు వాయిదా

By narsimha lode  |  First Published Feb 27, 2023, 3:58 PM IST

పారిశ్రామికవేత్త  చిగురుపాటి  జయరాం  హత్య కేసు  ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో  సంచలనానికి కారణమైంది.  
ఈ హత్య కేసు తీర్పును కోర్టు  వాయిదా వేసింది.


హైదరాబాద్: పారిశ్రామిక వేత్త  చిగురుపాటి జయరాం  హత్య  కేసులో  తీర్పును  ఈ ఏడాది మార్చి  6వ తేదీకి  నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. తీర్పు కాపీ సిద్దం కానందున  తీర్పును వాయిదా వేసినట్టుగా  నాంపల్లి కోర్టు  సోమవారం నాడు తెలిపింది.  

2019  జనవరి  31న  జయరామ్ ను రాకేష్ రెడ్డి  హత్య  చేశాడు.  ఈ కేసులో హైద్రాబాద్  పోలీసులు  కోర్టులో  చార్జీషీట్ ను దాఖలు  చేశారు.  12 మందిని  నిందితులుగా  చార్జీషీట్ లో  పోలీసులు  పేర్కొన్నారు.  చిగురుపాటి జయరామ్  ను  రాకేష్ రెడ్డి  హత్య  చేశాడని పోలీసులు చార్జీషీట్ లో  పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి  పోలీస్ అధికారులు  సహకరించారని ఆ చార్జీషీట్ లో  పోలీసులు  తెలిపారు.  
 

Latest Videos

click me!