మోడీ సమన్లు: కవితకు ఈడీ నోటీసులపై కేటీఆర్

By narsimha lode  |  First Published Mar 9, 2023, 1:17 PM IST

కవితకు  ఈడీ సమన్లపై  బీఆర్ఎస్  స్పందించింది. రాజకీయ ప్రేరేపితమైన  వేధింపులను రాజకయీంగానే  ఎదుర్కొంటామని  మంత్రి కేటీఆర్  చెప్పారు.  


హైదరాబాద్:కవితకు  ఈడీ సమన్లను  మోడీ  సమన్లుగా  తెలంగాణ మంత్రి కేటీఆర్  చెప్పారు. 
గురువారంనాడు  బీఆర్ఎస్ కార్యాలయంలో  తెలంగాణ మంత్రి కేటీఆర్  మీడియాతో మాట్లాడారు.  కేంద్ర దర్యాప్తు సంస్థలను బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై  ఉసిగొల్పుతుందని  ఆయన  విమర్శించారు. రాజకీయ ప్రేరేపితమైన  కేసులను  రాజకీయంగానే ఎదుర్కొంటామన్నారు. తాము  విచారణను  ఎదుర్కొంటామని  కేటీఆర్ చెప్పారు.బీజేపీ  నేతల మాదిరిగా  విచారణకు తాము దూరంగా  ఉండబోమని  ఆయన చెప్పారు.  కవిత  విచారణకు  హాజరుకానుందని  ఆయన చెప్పారు.  చట్టాన్ని గౌరవించే  వ్యక్తిగా విచారణను ఎదుర్కొంటామని  కేటీఆర్  ప్రకటించారు.  

ఎమ్మెల్యేల కొనుగోలు  కేసులో  దొరికిపోయిన బీజేపీ నేత బీఎల్ సంతోష్ స్టే తెచ్చుకున్న విషయాన్ని ఆయన గుర్తు  చేశారు.  తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు  చేసేందుకు  స్వామిజీలను పంపి  సంతోష్ దొరికిపోయి  దాక్కున్నాడన్నారు. విచారణకు  రాకుండా  కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాడని ఆయన  ఎద్దేవా చేశారు.  కానీ బీజేపీ నేతల మాదిరిగా  తాము దాక్కోబోమన్నారు.   రాజకీయపరమైన వేధింపులను రాజకీయంగానే ఎదుర్కొంటామని  కేటీఆర్  చెప్పారు.

Latest Videos

కవిత కు వచ్చిన  సమన్లు  మొదటివి కావు, ఆఖరివి కావన్నారు. ఇంకా  ఇలాంటి  నోటీసులు  చాలా వస్తాయని  తమకు  తెలుసునని  కేటీఆర్  చెప్పారు.విచారణను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం తమకు ఉందని  కేటీఆర్  చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమకు  నమ్మకం ఉందన్నారు. మంచి జడ్జిలు ఇంకా  ఉన్నారని  ఆయన తెలిపారు. 

also read:మార్చి 11నే విచారణకు ఎమ్మెల్సీ కవిత, స్పష్టం చేసిన ఈడీ.. రేపు ధర్నా యధాతథం..

తమ పార్టీకి  చెందిన  12 మందిపై ఈడీ,సీబీఐ, ఐటీల ను కేంద్రం ఉసిగొల్పిందని  ఆయన  ఆరోపించారు.  తమ  మంత్రులు  గంగుల కమలాకర్,  మల్లారెడ్డి,  తలసాని శ్రీనివాస్ యాదవ్  ఇంటికి  దర్యాప్తు  సంస్థల్ని ఉసిగొల్పారని  మంత్రి కేటీఆర్  ఆరోపించారు. నామా నాగేశ్వరరావు,  వద్దిరాజు రవిచంద్ర, ఎల్, రమణ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రోహిత్ రెడ్డిలపై  దర్యాప్తు  సంస్థలను  ఉసిగొల్పిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు.  

click me!