
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై స్పందించారు మంత్రి కేటీఆర్. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి కేటీఆర్ ప్రసంగిస్తూ... మతాల పేరుతో కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పాడంటూ మండిపడ్డారు. తాగడానికి నీళ్లు లేవని కొందరు, తిండి లేదని మరికొందరు దేశంలో అల్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌లో తెలంగాణ రాష్ట్రం అత్యున్నత స్థితికి చేరుకుందని.. 8 ఏళ్ల పాలనలో ఏం సాధించారని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
జలసంరక్షణలో తెలంగాణ దేశానికే ఓ నమూనాగా మారిందని.. సిరిసిల్ల జిల్లా ఐఏఎస్‌లకే జలసంరక్షణ పాఠాలు చెప్పే స్థాయికి చేరిందని మంత్రి అన్నారు. కేసీఆర్ హయాంలో 8 ఏళ్లలో 2.22 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ గుర్తుచేశారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని.. అందుకే ప్రైవేట్ రంగ సంస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 8 ఏళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఒక్క విద్యా సంస్థను కూడా కేటాయించలేదని.. రాష్ట్రానికి వచ్చిపోయే వారు మాపై విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso REad:ప్రగతి భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన రైతు సంఘాల నేతల సమావేశం..
అంతకుముందు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో నెలకొన్న పరిస్థితులతో పాటు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇక, 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలు ఈరోజు ఉదయం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణలో వ్యవసాయం, సాగునీటి రంగం, ఇతర ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకరించారు.