
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళతారు.
ఇక, కొద్దిసేపటి క్రితం జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. జేపీ నడ్డాతో పాటు ఆయన సతీమణి కూడా హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌లతో పాటు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు.
జేపీ నడ్డా తెలంగాణ టూర్ ఇలా..
ఇక,వరంగల్ చేరుకోనున్న జేపీ నడ్డా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర బీజేపీ నాయకులతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట నారాయణ నివాసానికి జేపీ నడ్డా వెళ్లనున్నారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ వద్దకు చేరుకుంటారు. బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొంటారు.
దాదాపు గంటకు పైగా జేపీ నడ్డా బీజేపీ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు బయలుదేరుతారు. అనంతరం నోవాటెల్ హోటల్‌లో హీరో నితిన్‌తో సమావేశం కానున్నారు. అలాగే మరికొందరు సినీ ప్రముఖులు, కవులు, రచయితలతో జేపీ నడ్డా సమావేశమవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.