ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు .. నిరూపిస్తే, ఎమ్మెల్యేగానే వుంటా : బీజేపీకి కేటీఆర్ సవాల్

Siva Kodati |  
Published : Apr 20, 2022, 07:37 PM IST
ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు .. నిరూపిస్తే, ఎమ్మెల్యేగానే వుంటా : బీజేపీకి కేటీఆర్ సవాల్

సారాంశం

బీజేపీ నేతలపై మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తాను చెప్పింది రుజువు చేస్తే.. సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని బీజేపీకి మంత్రి సవాల్ విసిరారు.   

(bjp) బీజేపీకి (trs) టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) సవాల్ విసిరారు. తాను చెప్పింది రుజువు చేస్తే సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు. కేంద్రానికి రూ.3,65,797 కోట్లు ఇచ్చామని.. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రూ.కోటి 65 లక్షలు మాత్రమేనన్నారు. దమ్ముంటే బీజేపీ నాయకులు రుజువు చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay), టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డిలపై (revanth reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిల్లరగాళ్లను ఎవరూ పట్టించుకోలేదని ఫైరయ్యారు. కేసీఆరే లేకుంటే టీపీసీసీ , టీ బీజేపీ ఎక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు. సోషల్ మీడియా, మీడియా వుందని ఇష్టమొచ్చినట్లు మొరుగుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మాట్లాడుతున్న చిల్లర, మల్లర నేతలెవరూ ఆనాడు లేరని కేటీఆర్ గుర్తుచేశారు. ఎవరీ రేవంత్ రెడ్డి... ఎవరీ బండి సంజ్ అంటూ ఫైరయ్యారు. కాలర్ ఎగరేసి నాది తెలంగాణ అని చెప్పే ధైర్యం ఇచ్చింది కేసీఆర్ అని మంత్రి తెలిపారు. కరీంనగర్‌లో ఎంపీగా గెలిపిస్తే ఏం పీకారంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌కు ఏం చేయలేని వాడికి.. పాలమూరులో ఏం పని అని మంత్రి ప్రశ్నించారు. వినోద్ కుమార్ ఎంపీగా వున్నప్పుడు కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ కోసం ప్రయత్నం చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణకు ఇన్నేళ్లలో మీరు ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. 

అంతకుముందు.. తెలంగాణపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు వివ‌క్ష‌ను చూపిస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల (kishan reddy) తీరుపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డి తెలంగాణ‌కు ప్రాజెక్టుల‌ను తీసుకురావ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను గుజ‌రాత్ లో ప్రారంభ‌మైన సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ.. పై వ్యాఖ్య‌లు చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే