ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో చెప్పాలి: ఈటలకు కొప్పుల ప్రశ్న

By narsimha lodeFirst Published May 4, 2021, 12:43 PM IST
Highlights

సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ మాట్లాడారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. 

కరీంనగర్: సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ మాట్లాడారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మంగళవారంనాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్  హైద్రాబాద్ టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ కు ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో చెప్పాలన్నారు. కుటుంబ అవసరాల కోసం అసైన్డ్ భూములను కొనడం తప్పు కాదా అని ఆయన ప్రశ్నించారు. 

als read:ప్రలోభాలకు లొంగలేదు, అందుకే తప్పుడు ఆరోపణలు: ఈటల రాజేందర్

రైతులకు అడ్వాన్స్ ఇచ్చి భూములు తీసుకొన్నట్టుగా రాజేందర్ ఒప్పుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదన్నారు. కొద్ది రోజులుగా పార్టీకి, కేసీఆర్  కు వ్యతిరేకంగా రాజేందర్ మాట్లాడుతున్నారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలపై ఈటల రాజేందర్ విమర్శలు చేశారన్నారు. ఇది క్రమశిక్షణ కాదన్నారు. ఈ పరిణామాలన్నీ అధిష్టానం దృష్టిలో ఉన్నాయన్నారు. 

తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. పార్టీతో లబ్దిపొందిన ఆయన పార్టీనే నష్టపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరైందికాదన్నారు. అసైన్డ్ భూములను ఎవరూ కూడ కొనొద్దని చట్టం చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ఈ భూములను ఎలా కొనుగోలు చేశాని ఆయన ప్రశ్నించారు. మంత్రివర్గంలో కూడ ఈటలకు కేసీఆర్ ప్రత్యేక స్థానం కల్పించారని ఆయన గుర్తు చేశారు. పార్టీలో  ఈటల కు ప్రాధాన్యత లేకుండా చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. అసైన్డ్ భూముల కొనుగోలుతో ఎస్సీలకు ఈటల లాభం చేశారో, నష్టం చేశారో చెప్పాలన్నారు. 

click me!