విషాదం : గొంతు, చేతులు కోసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య !

Published : May 04, 2021, 10:38 AM IST
విషాదం : గొంతు, చేతులు కోసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య !

సారాంశం

హైదరాబాద్ లో దారుణ సంఘటన జరిగింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన కానిస్టేబులే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులతో అభిలాష్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి మూసారాంబాగ్ లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే అభిలాష్, కుటుంబంతో కలిసి మూసారాంబాగ్ లో నివాసముంటున్నారు. రెండు రోజుల కిందట భార్య, ఇద్దరు పిల్లలను కోదాడలోని అత్తగారింట్లో వదిలి ఇంటికి వచ్చాడు.

అభిలాష్ నిన్న రాత్రి తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. అయితే ఎలాంటి శబ్దాలూ లేకపోవడం, ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడూ గడియపెట్టుకోకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.

తలుపులు కొట్టినా తీయకపోవడంతో, పగలగొట్టి చూడగా అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

చేతి మణికట్టు వద్ద కోసుకొని అభిలాష్ బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu
Telangana Weathe Update: రానున్న 24 గంటల్లో చలిపంజా వాతావరణశాఖా హెచ్చరిక| Asianet News Telugu