ప్రలోభాలకు లొంగలేదు, అందుకే తప్పుడు ఆరోపణలు: ఈటల రాజేందర్

By narsimha lodeFirst Published May 4, 2021, 11:07 AM IST
Highlights

తప్పుడు ఆరోపణలతో తనను కేబినెట్ నుండి బయటకు పంపారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం నాడు ఎన్ఆర్ఐలతో ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమావేశమయ్యారు. 


హైదరాబాద్:తప్పుడు ఆరోపణలతో తనను కేబినెట్ నుండి బయటకు పంపారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం నాడు ఎన్ఆర్ఐలతో ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం మరో ఉద్యమం మొదలైందన్నారు. ఇది ఆత్మగౌరవ ఉద్యమంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసమా? అనే అంశంపై ఈటల కి మద్దతుగా ఈ సమావేశం నిర్వహించారు. 

als read:రెండు రోజుల్లో పరిస్థితులు మారే ఛాన్స్, నా భవిష్యత్తు కార్యాచరణ చెబుతా: ఈటల రాజేందర్

తన వ్యాపారాలపై, ఆస్తులపై  సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంగిలి మెతుకుల కోసం తాను ఆశపడనని తేల్చి చెప్పారు. ప్రజల ను నమ్ముకున్నానని ఆయన తెలిపారు.ప్రలోభాలకు లొంగనందునే తనపై  నిందలు వేస్తున్నారని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మద్దతిచ్చిన ఎన్ఆర్ఐలకు ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. 

మంత్రివర్గం నుండి తొలగించబడిన తర్వాత ఈటల రాజేందర్ సోమవారం నాడు హైద్రాబాద్ నుండి తన స్వంత నియోజకవర్గం హుజూరాబాద్ కు వెళ్లారు. భారీ కాన్వాయ్ తో ఆయన హుజూరాబాద్ కు చేరుకొన్నారు. అనుచరులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి కూడ రాజేందర్ రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. 
 

click me!