నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు, త్వరలోనే నోటిఫికేషన్ : జగదీశ్ రెడ్డి

Siva Kodati |  
Published : Oct 01, 2023, 03:42 PM IST
నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు, త్వరలోనే నోటిఫికేషన్  : జగదీశ్ రెడ్డి

సారాంశం

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి.  విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. విద్యుత్ శాఖలోని 13 వేల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేశామని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.   

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా నియమితులైన 1362 మంది జూనియర్ లైన్‌మెన్లకు శనివారం రాత్రి జెన్ కో ఆడిటోరియంలో మంత్రి నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. గత తొమ్మిదన్నరేళ్లలో రాష్ట్ర విద్యుత్తు సంస్థల్లో 35,774 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 10,312.. ట్రాన్స్‌కోలో 4,403.. జెన్‌కో 3,689.. ఎన్‌పీడీసీఎల్‌లో 4,370 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్లు మంత్రి వెల్లడించారు. 13 వేల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేశామని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. 

ALso Read: అంగన్వాడీలకు గుడ్ న్యూస్... జీతాల పెంపుకు ప్రభుత్వం ఓకే... సమ్మె విరమణ

ఇకపోతే.. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీల ఆందోళలతో దిగివచ్చింది. కొంతకాలంగా తమ జీతాలు పెంచడంతో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అంగన్వాడీలతో స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్థిక మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చడంతో పాటు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలపై హామీ ఇచ్చారు. మిగతా సమస్యల పరిష్కారానికి కూడా మంత్రులు సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమిస్తున్నట్లు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ జేఏసి ప్రకటించింది. 

తమ సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంగన్వాడీల కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమతో చర్చలు జరిపి ప్రభుత్వం తరపున సానుకూల నిర్ణయం తీసుకున్న మంత్రులు హరీష్, సత్యవతి రాథోడ్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సమ్మెకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమ్మెను విరమించి ప్రతి ఒక్కరు విధులకు హాజరుకావాలని అంగన్వాడీ టీచర్స్ ఆండ్ హెల్పర్స్ జేఏసి సూచించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్