కేసీఆర్‌ను ముట్టుకొంటే కాలిపోతారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జగదీష్ రెడ్డి కౌంటర్

Published : Feb 15, 2022, 03:16 PM IST
కేసీఆర్‌ను ముట్టుకొంటే కాలిపోతారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జగదీష్ రెడ్డి కౌంటర్

సారాంశం

కేసీఆర్ ను ముట్టుకొంటే కాలిపోతారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు. 

హైదరాబాద్:  సీఎం KCR ను ముట్టుకుంటే కాలిపోతారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి Jagadish Reddy హెచ్చరించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి Kishan Reddy  వ్యాఖ్యలపై మంగళవారం నాడు జగదీష్ రెడ్డి స్పందించారు.  టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మిలటరీ ఉందని కేసీఆర్ ను పట్టుకుపోతారా అని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.  కిషన్ రెడ్డి స్వంతూరికి పోయినా కేసీఆర్ పాలన గురించి BJP  చేసిన నష్టంపై ప్రజలు చెబుతారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చలకు  కేసీఆర్ రావాలా అని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. 

కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఏమైనా నిధులు తీసుకొచ్చారా అని ఆయన ప్రశ్నించారు. మిషన్ కాకతీయ అద్బుతమైన పథకమని నీతి ఆయోగ్ ప్రశంసించిన విషయాన్ని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఈ పథకానికి నిధులు ఇవ్వాలని కూడా Niti Ayog సిఫారసులు చేసిందన్నారు. 

కానీ కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వని విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రాల హక్కుల గురించి బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు., ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమి్ షా చేసిన అవమానం గురించి బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. 

విద్యుత్ సంస్కరణలను దొడ్డిదారిన అమలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ సంస్కరణలపై చట్టం తీసుకు రాకుండా పాలసీ విధానంగా అమలు చేస్తున్నారని తెలిపారు.చట్టం చేస్తే రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయని భావించి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ మీటర్లకు మోటార్లు పెట్టాలని కేంద్ర చెబుతుందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.

కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే?

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏడేళ్లలో దేశానికి ఏం చేసిందో చెప్పడానికి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ముందు అమరుల సాక్షిగా కేసీఆర్‌తో చర్చకు సిద్ధమన్నారు. కేసీఆర్ బహిరంగ సవాల్‌ను కేంద్రం తరపున తాను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ చర్చకు నేను సిద్ధం కానీ ఒక షరతు విధించారు. కేసీఆర్ ప్రజలు మాట్లాడే భాష మాట్లాడాలని కేంద్ర మంత్రి కోరారు. బీజేపీకి దేశమే ముఖ్యమని... వ్యక్తులు, కుటుంబం కాదన్నారు. కానీ కేసీఆర్‌కు వ్యక్తులు, కుటుంబం మాత్రమే ముఖ్యమని కేంద్రమంత్రి అన్నారు. ఇండియా అంటే ఇందిరా అనే నినాదాన్ని రాజ్యాంగం ద్వారానే ఓడించారని తెలిపారు. రాజ్యాంగ హక్కు వల్లనే హుజురాబాద్‌లో కేసీఆర్ ఓడిపోయారని అందుకే రాజ్యాంగం మారాలని అంటున్నారని మండిపడ్డారు.

బీజేపీకి నడ్డా తరువాత ఎవరు అధ్యక్షుడు అవుతారో ఎవరూ చెప్పలేరని కానీ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తరువాత కేటీఆర్ అధ్యక్షుడు అవుతారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కేసీఆర్ డైనింగ్ టేబుల్‌పై నిర్ణయాలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో ఏం జరుగుతుందో తెలుసా కేసీఆర్ అని ప్రశ్నించారు. గత ఏడేళ్లుగా మతకలహాలు లేవని  బాంబ్ పేలుళ్లు లేవని, కర్ఫ్యూలు లేవన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో నెలల పాటు రోడ్లన్నీ మూసివేసి ఉండేవని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల శాంతితో ముందుకు వెళ్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రేవంత్ రెడ్డి సమక్షంలో ఉగాది పంచాంగం | Ugadi Panchangam 2026 | Asianet News Telugu
Neem Trees: ఉగాది పూట వేప పువ్వు దొర‌క‌ని పరిస్థితి.. ఇంత‌కి వేప చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి.?