సిద్ధిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు.. అభివృద్ధి బాధ్యత నాదే: హరీశ్ రావు

Siva Kodati |  
Published : Sep 16, 2020, 05:01 PM ISTUpdated : Sep 16, 2020, 05:04 PM IST
సిద్ధిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు.. అభివృద్ధి బాధ్యత నాదే: హరీశ్ రావు

సారాంశం

సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. బుధవారం దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. బుధవారం దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. సిద్ధిపేట తరహాలో దుబ్బాకను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, అందుకు సంబంధించిన బాధ్యతను తానే తీసుకుంటానని హరీశ్ రావు వెల్లడించారు.

దుబ్బాక మహిళల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ప్రతి ఎకరాకు సాగునీరు అందించి శాశ్వత పరిష్కారం చూపుతామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.

నియోజకవర్గంలో లక్షా 35 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. దుబ్బాక అంటే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం వుందని... ఈ ప్రాంత అభివృద్ధికి రూ.35 కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారని హరీశ్ గుర్తుచేశారు. 

PREV
click me!

Recommended Stories

Padma Awards: అద్మ అవార్డుల‌ను ఎక్క‌డ త‌యారు చేస్తారు? వీటి త‌యారీకి ఎంత ఖ‌ర్చ‌వుతుంది.?
Medaram Jathara 2026 : మేడారంకు ఎక్కడెక్కడి నుండి ఆర్టిసి బస్సులుంటాయి.. ఎక్కడి నుండి ఎంత ఛార్జీ..?