కొత్త వేరియంట్‌ కలకలం.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్, రేపు అధికారులతో మంత్రి హరీశ్ సమీక్ష

By Siva KodatiFirst Published Nov 27, 2021, 4:41 PM IST
Highlights

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ (south africa new variant) ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (telangana govt) అప్రమత్తమైంది. దీనిలో భాగంగా రేపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో భేటీకానున్నారు మంత్రి హరీశ్ రావు (harish rao) 

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ (south africa new variant) ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (telangana govt) అప్రమత్తమైంది. దీనిలో భాగంగా రేపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో భేటీకానున్నారు మంత్రి హరీశ్ రావు (harish rao) . కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న దేశాల నుంచి వచ్చే వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. ఇదే విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రప్రభుత్వం. ఆయా దేశాల నుంచి నేరుగా హైదరాబాద్‌కు విమానాలు లేని కారణంగా ముంబై , ఢిల్లీలలో దిగి హైదరాబాద్‌కు వచ్చే వారిని ట్రేసింగ్, టెస్టింగ్ ఎలా చేయాలన్న దానిపై అధికారులతో చర్చించనున్నారు హరీశ్ రావు (harish rao) . 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైధ్యాధికారులతో మంత్రి హరీష్‌రావు భేటీ అయ్యారు. బి.1.1.259 వేరియంట్‌పై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్రం అలెర్ట్ నేపథ్యంలో వైద్య ఉన్నతాధికారులతో మంత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. అటు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో కరోనా భయం వెంటాడుతోంది.  శుక్రవారం మేడ్చల్ జిల్లాలోని (medchal district) టెక్‌ మహీంద్రా వర్సిటీలో (tech mahindra university) 30 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. 25 మంది విద్యార్థులు, ఐదుగురు సిబ్బంది వైరస్ బారినపడ్డారు. దీంతో ముందు జాగ్రత్తగా వర్సిటీ యాజమాన్యం సెలవులు ప్రకటించింది. 

ALso Read:Omicron: కొత్త వేరియంట్‌పై పీఎం మోడీ సమీక్ష.. ప్రధాని చెప్పిన విషయాలివే

కాగా.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో క్యాబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, పీకే మిశ్రాలతో ప్రధాని మోడీ (narendra modi) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సుమారు రెండు గంటలపాటు జరిగింది. ఇందులో ప్రస్తుతం దేశంలోని పరిస్థితులను ప్రధానికి అధికారులు వివరించారు. కొత్త వేరియంట్‌ను ఆందోళనకారక వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం గుర్తించడం, కొత్త వేరియంట్‌తో భారత్, సహా ఇతర దేశాలపై పడే ప్రభావాలనూ ప్రధానికి అధికారులు తెలియజేసినట్టు ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల్లో కనిపించింది. కొత్త వేరియంట్ కలకలం రేపుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక సూచనలూ చేశారు.

కొత్త వేరియంట్ విజృంభించే ముప్పు ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలు ఎత్తేయాలనే నిర్ణయాన్ని సమీక్షించాలనీ ఈ సందర్భంగా ప్రధాని మోడీ సూచనలు చేశారు. ప్రజలూ మరింత జాగ్రత్తగా మసులుకోవాలని తెలిపారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అంతేకాదు, విదేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహించడంపై జాగ్రత్త వహించాలని అధికారులకు తెలిపారు. ముఖ్యంగా కరోనా కేసుల రిస్క్ ఉన్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు.
 

click me!