మల్లన్నసాగర్ ఆపాలని ప్రతిపక్షాల కుట్ర.. కేసీఆర్ గెలిచి చూపారు: హరీశ్ రావు

Siva Kodati |  
Published : Feb 23, 2022, 02:43 PM IST
మల్లన్నసాగర్ ఆపాలని ప్రతిపక్షాల కుట్ర.. కేసీఆర్ గెలిచి చూపారు: హరీశ్ రావు

సారాంశం

ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయని..  మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పూర్తికాదంటూ చవాకులు పేలారని చెప్పారు. పట్టుదల వుంటే కానిది ఏది వుండదని కేసీఆర్ (kcr) రుజువు చేశారని హరీశ్ రావు ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆపాలని హైకోర్టు, సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కలిపి 350 కేసులు వేశారని మంత్రి గుర్తుచేశారు.

తెలంగాణకే మల్లన్నసాగర్ (mallanna sagar) , కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లు (kaleshwaram project) తలమానికమన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య , ఆర్ధిక మంత్రి హారీశ్ రావు(harish rao) . బుధవారం మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్ రావు మాట్లాడుతూ.. మల్లన్న దేవుడు పుట్టినరోజైన బుధవారమే మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ప్రారంభించుకోవడం కాకతాళీయమే అన్నారు. ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయని.. ఈ ప్రాజెక్ట్ పూర్తికాదంటూ చవాకులు పేలారని చెప్పారు. పట్టుదల వుంటే కానిది ఏది వుండదని కేసీఆర్ (kcr) రుజువు చేశారని హరీశ్ రావు ప్రశంసించారు. 

ఇవాళ ఇంకో ప్రత్యేకత కూడా వుందని.. ఈ ప్రాజెక్ట్‌ను ఆపాలని హైకోర్టు, సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కలిపి 350 కేసులు వేశారని మంత్రి గుర్తుచేశారు. కానీ ఫిబ్రవరి 23, 2018న సుప్రీంకోర్టు అన్ని కేసులను కొట్టివేస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చిందని హరీశ్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఈ రిజర్వాయర్ వస్తే మొత్తం తెలంగాణ బాగుపడుతుందని.. ఈ స్థలాన్ని సీఎం ఎంపిక చేశారని మంత్రి పేర్కొన్నారు. ఇక్కడికి నీళ్లు వస్తే.. సగం తెలంగాణకు నీళ్లు పారతాయన్నారు. 

ఇంజనీర్లు, నిపుణులతో చర్చించి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌కు కేసీఆర్ రూపకల్పన చేశారని ప్రశంసించారు. గతంలో దుబ్బాక, సిద్ధిపేట, చేర్యాల, హుస్నాబాద్ ప్రాంతాలు కరువు సీమగా గుర్తింపు తెచ్చుకున్నాయని.. వేలాది మంది ఉపాధి కోసం వలసలు వెళ్లేవారని హరీశ్ రావు  పేర్కొన్నారు. అలాంటి ఈ ప్రాంతంలోకి గోదావరి తల్లిని తీసుకొచ్చి కేసీఆర్ సస్యశ్యామలం చేశారని మంత్రి వెల్లడించారు. నదిలేని చోట రిజర్వాయర్‌ను కట్టడం మల్లన్నసాగర్ ప్రత్యేకత అన్నారు. 

కాగా.. సిద్దిపేట జిల్లాలోని Mallanna Sagar  రిజర్వాయర్ ను తెలంగాణ సీఎం KCR బుధవారం నాడు ప్రారంభించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న రిజర్వాయర్లలో మల్లన్నసాగర్ అతి పెద్ద రిజర్వాయర్ . ప్రపంచంలోనే అతి పెద్దదైన  ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం తుదిదశకు చేరుకొంది. ముఖ్యంగా మల్లన్నసాగర్‌ తెలంగాణకు గుండెకాయ.kaleshwaram ప్రాజెక్టులోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యమున్న, అత్యంత ఎత్తున ఉన్న జలాశయం మల్లన్నసాగర్. సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ  జలాశయానికి 5 ఓటీ స్లూయిస్ లను  ఏర్పాటు చేశారు. ఉన్నాయి. ఆ తూముల ద్వారానే కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌కు, సింగూరు ప్రాజెక్టుకు, తపాస్‌పల్లి రిజర్వాయర్ కు, మిషన్ భగీరథకు నీటిని తరలిస్తారు.మల్లన్నసాగర్  ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు ఓ వరప్రదాయిని. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం DPRలో మల్లన్నసాగర్‌ను మదర్ రిజర్వాయర్ గా  పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు