మహబూబాబాద్ జిల్లాలో విషాదం: 22 ఏళ్ల సుప్రియ సూసైడ్, గ్యాంగ్ రేప్ కారణమా?

Published : Feb 23, 2022, 02:24 PM ISTUpdated : Feb 23, 2022, 03:18 PM IST
మహబూబాబాద్ జిల్లాలో  విషాదం: 22 ఏళ్ల సుప్రియ సూసైడ్, గ్యాంగ్ రేప్ కారణమా?

సారాంశం

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరులో సుప్రియ అనే యువతి ఆత్మహత్య చేసుకొంది. మృతురాలిపై  గ్యాంగ్ రేప్ జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ నెల 18న ఆమె పురుగుల మందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించింది.

మహబూబాబాద్:Mahabubabadజిల్లా నెల్లికుదురు మండలం Alair లో సుప్రియ అనే యువతి Suicide చేసుకొంది. తన చావుకు నలుగురు కారణమని ఆమె సూసైడ్ నోట్ రాసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు కు చెందిన మృుతురాలిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి. దీంతో ఆమె ఈ నెల 18న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు ఇవాళ మరణించిందని పోలీసులు తెలిపారు.

సూసైడ్ నోట్ రాసింది.. యాట సాగర్, నయీం, సద్దాం హుస్సేన్,జగదీష్  అనే నలుగురు వ్యక్తుల పేర్లను సుప్రియ సూసైడ్ నోట్ రాసింది. తన జీవితాన్ని ఈ నలుగురు నాశనం చేశారని ఆమె రాసింది. మృతురాలు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతురాలు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది.  మృతురాలి ఇంటికి పక్కనే ఉన్న మూడో ఇంట్లో ఉంటున్న సాగర్  సహా అతని స్నేహితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?