డూప్లికేట్‌గాళ్లను నమ్మొద్దు: సిద్ధిపేటలో హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Apr 25, 2021, 5:48 PM IST
Highlights

టీఆర్ఎస్ కీలక నేత, ఆర్ధిక మంత్రి హరీశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు కోసం వచ్చే వాళ్ళు కావాలా? ఆపదలో ఆదుకునేవాళ్లు కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. 

టీఆర్ఎస్ కీలక నేత, ఆర్ధిక మంత్రి హరీశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు కోసం వచ్చే వాళ్ళు కావాలా? ఆపదలో ఆదుకునేవాళ్లు కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదివారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ 17వ వార్డులో కాలికి మట్టి అంటకుండా రోడ్లు వేశామని గుర్తుచేశారు.

వార్డులో ఎవరు ఇళ్ళు లేని వారు ఉండకూడదని, మనిషి పుట్టుక నుంచి చావు వరకు అన్ని వసతులు కల్పించామని మంత్రి వెల్లడించారు. ఒకనాడు సిద్దిపేటలో నీటి ఎద్దడి చూసి పిల్లను ఇవ్వాలంటే ఆలోచించేవారని హరీశ్ రావు పేర్కొన్నారు.

Also Read:మున్సిపల్ ఎన్నికల వాయిదా... హైకోర్టును ఆశ్రయించిన షబ్బీర్ అలీ

ఆనాడు సిద్దిపేట పందులకు ప్రసిద్ధని... ఇవాళ అభివృద్ధికి ప్రసిద్ధి అని మంత్రి వెల్లడించారు. పట్టణంలో కుక్కలు, కోతులు, దోమల బెడద లేకుండా చేశామని మంత్రి పేర్కొన్నారు. టీఅర్ఎస్‌కి తప్ప డూప్లికేట్ వాళ్లకు ఓట్లు వేయవద్దని, పగటి వేషగాళ్లను నమ్మి మోసపోవద్దని హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.

కాగా, రాష్ట్రంలో రెండు కార్పొరేష‌న్లు, ఐదు మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌లు షెడ్యూల్ ప్రకార‌మే ఎన్నిక‌లు నిర్వహిస్తామ‌ని ఎస్ఈసీ పార్థసార‌థి స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధ‌న‌లు క‌ట్టుదిట్టంగా అమ‌లు చేస్తామ‌ని, ముందు జాగ్రత్తలు తీసుకుంటామ‌ని ప్రభుత్వం ఎస్ఈసీకి హామీ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో అధికారుల‌తో ఎస్ఈసీ చ‌ర్చించి.. ఎన్నిక‌ల ప్రక్రియ కొన‌సాగించాల‌ని నిర్ణయించింది.

click me!