మహిళలతో ఫోటోలు, వీడియోలు: బ్లాక్ మెయిల్, నిందితుడి అరెస్ట్

Published : Apr 25, 2021, 04:55 PM IST
మహిళలతో  ఫోటోలు, వీడియోలు:  బ్లాక్ మెయిల్, నిందితుడి అరెస్ట్

సారాంశం

మహిళలతో పరిచయం పెంచుకొని సెల్ఫీలు, ఫోటోలు, వాట్సాప్  చాటింగ్ తో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న యువకుడిని సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.  

హైదరాబాద్: మహిళలతో పరిచయం పెంచుకొని సెల్ఫీలు, ఫోటోలు, వాట్సాప్  చాటింగ్ తో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న యువకుడిని సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ కు చెందిన  ఎండీ అక్రమ్ బిన్ అహ్మద్ అలియాస్ అక్రం ఖాన్ వయస్సు 23 ఏళ్లు.  పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో మహిళలను లక్ష్యంగా చేసుకొన్నాడు.  మహిళలతో పరిచయాలు పెంచుకొని వారిని లోబర్చుకొని బ్లాక్ మెయిల్‌కి పాల్పడుతున్నాడు. 

తొలుత మంచివాడిగా నటించి మహిళలతో పరిచయం పెంచుకొంటాడు. వారి ఫోన్ నెంబర్లు తీసుకొంటాడు. ఫోన్లో వారితో చాటింగ్ చేస్తాడు, వాట్సాప్ చాటింగ్, ఫోన్ లో మాట్లాడే సమయంలో రికార్డు చేయడం , వీడియో కాల్స్ చేసిన సమయంలో వాటిని స్క్రీన్ షాట్స్ తీసుకొని  బెదిరింపులకు పాల్పడ్డేవాడు. 

మహిళల కుటుంబసభ్యులకు ఈ ఫోటోలు, ఆడియో సంభాషణ లేదా వీడియోలను పంపుతానని బెదిరింపులకు పాల్పడి డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఇలానే ఓ మహిళను లోబర్చుకొన్నాడు.  ఆమె నుండి రూ. 18 లక్షలు తీసుకొన్నాడు. ఇంకా కూడ డబ్బుల కోసం వేధింపులకు పాల్పడ్డాడు.  దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.  ఈ ఫిర్యాదు మేరకు అక్రమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్