రెచ్చగొట్టి లబ్దిపొందడంలో బీజేపీ ముందుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తాంత్రిక పాలన అంటూ తమ పాలనపై చేసిన విమర్శలపై హరీష్ రావు మండిపడ్డారు.
హైదరాబాద్: తాంత్రిక పాలన అంటూ రెచ్చగొట్టి లబ్దిపొందడం బీజేపీ లక్ష్యమని తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఫాంహౌస్ లో గోవు పూజను కేసీఆర్ చేస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు.
బుధవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు బడ్జెట్ పై విపక్షాల సందేహలకు సమాధానమిచ్చారు. తెలంగాణలో పర్యటించిన సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహ కేంద్ర మంత్రులు తాంత్రిక పాలన చేస్తున్నారన్నారు. కేసీఆర్ దేవుడిని విశ్వసిస్తారన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కేసీఆర్ దేవుడికి మొక్కుకుని ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రం ప్రారంభించిన కొత్త జిల్లాలు, కాలువలకు దేవుళ్ల పేర్లు పెట్టిన విషయాన్ని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఆలయాలను ప్రారంభించుకొనే అలవాటు తమకు లేదని పరోక్షంగా బీజేపీ నేతలపై ఆయన విమర్శలు చేశారు.
also read:రైతులకు కోతలు, కార్పోరేట్లకు మోడీ వరాలు: రైతు సంక్షేమంలో కేసీఆర్ రోల్ మోడలన్న హరీష్
షాం హౌస్ లో తాంత్రిక పూజలు చేస్తున్నారని కొందరు విమర్శలు చేశారన్నారు. ఫాం హౌస్ లో గోవు పూజ మాత్రమే కేసీఆర్ చేస్తారని మంత్రి హరీష్ రావు వివరించారు. దేవుడిపై ఎంత భక్తి విశ్వాసాలున్నా తాము మతాల పేరుతో ఏనాడు రెచ్చగొట్టలేదని హరీష్ రావు చెప్పారు. మతాలు, కులాలు పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం బీజేపీ లక్ష్యమని ఆయన విమర్శించారు. యూనివర్శిటీల్లో తాంత్రికపూజల కోర్సు ప్రారంభించిన ఘనత కూడా బీజేపీకే దక్కుతుందని హరీష్ రావు విమర్శించారు.తాను పూజలు, యాగాలు చేస్తానని మీరు కూడా వచ్చిన తీర్ధప్రసాదాలు తీసుకోవాలని తనపై విమర్శలు చేసిన వారిని కేసీఆర్ కోరిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు.