హైద్రాబాద్ కూకట్‌పల్లి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం:మంటలార్పుతున్న ఫైరింజన్లు

By narsimha lodeFirst Published Jul 10, 2021, 4:24 PM IST
Highlights


హైద్రాబాద్  సహా తెలంగాణలోని పలు పారిశ్రామిక వాడల్లో ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి.  ఫ్యాక్టరీల్లో ఫైర్ సేఫ్టీ పై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.

హైదరాబాద్: హైద్రాబాద్ కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్ లో గల ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం కారణంగా చేలరేగిన  మంటలకు కెమికల్ డ్రమ్ములు పేలిపోయాయి.  దీంతో పెద్ద పెద్ద శబ్దాలు విన్పించాయి. 

ఈ అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఫైటర్లు  ఫ్యాక్టరీలో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కెమికల్ డ్రమ్ములు పేలిన శబ్దాలతో స్థాినకులు భయబ్రాంతులకు గురౌతున్నారు.ఈ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై  అధికారులు ఆరా తీస్తున్నారు.  

హైద్రాబాద్ సహా పలు పారిశ్రామిక వాడల్లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడానికి సరైన ప్రమాణాలు పాటించకపోవడమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకొన్నారా లేదా అనే విషయాన్ని కూడ ఫైర్ సిబ్బంది పరిశీలించనున్నారు. 
 

click me!