ఓటమికి బాధ్యత వహిస్తున్నా: దుబ్బాక బైపోల్‌ రిజల్ట్స్ పై హరీష్ రావు

By narsimha lodeFirst Published Nov 10, 2020, 5:52 PM IST
Highlights

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమికి భాద్యత వహిస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రజా తీర్పును  శిరసావహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.


దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమికి భాద్యత వహిస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రజా తీర్పును  శిరసావహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం నాడు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ కు ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆయన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 

ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు చెప్పారు.   దుబ్బాక ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో  సమీక్షించుకుంటామన్నారు. తమ  లోపాలను సవరించు కుంటామని ఆయన తెలిపారు. 

also read:దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు.. అందుకే నన్ను గెలిపించారు: రఘునందన్ రావు

దుబ్బాక ప్రజా సేవలో నిరంతరం పాటు పడతాం అందుబాటులో ఉంటామన్నారు. ఓటమి పొందినా దుబ్బాక ప్రజల పక్షాన టి ఆర్  ఎస్ పక్షాన, తన  పక్షాన కష్ట సుఖాల్లో ఉంటామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కి  ప్రజలకు , కార్యకర్తలకు  అన్నివిధాల సహాయ సహకారాలు ఇస్తూ టి ఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు కృషి చేస్తోందన్నారు.


 

click me!