దుబ్బాక బైపోల్, ట్విస్టిచ్చిన సీఈఓ శశాంక్ గోయల్: ఆ నాలుగు ఈవీఎంలు లెక్కించలేదు

By narsimha lodeFirst Published Nov 10, 2020, 5:12 PM IST
Highlights

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఇంకా నాలుగు ఈవీఎంలలోని ఓట్లను లెక్కించాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) శశాంక్ గోయల్ చెప్పారు.
 


సిద్దిపేట: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఇంకా నాలుగు ఈవీఎంలలోని ఓట్లను లెక్కించాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) శశాంక్ గోయల్ చెప్పారు.

also read:దుబ్బాక: కేసీఆర్ కు షాక్, టీఆర్ఎస్ మీద బిజెపి తొలిదెబ్బ

మంగళవారం నాడు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక అసెంబ్లీ పరిధిలోని 21, 188 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా రిజల్ట్ రాలేదని ఆయన చెప్పారు.

ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లోని  నాలుగు ఈవీఎంలలో 1669 ఓట్లున్నాయని ఆయన వివరించారు.సాంకేతిక సమస్యల కారణంగా ఈ ఓట్లను లెక్కించలేకపోవడానికి ఇబ్బందులు నెలకొన్నాయన్నారు.దీంతో ఈ నాలుగు ఈవీఎంలలోని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించనున్నట్టుగా ఆయన తెలిపారు.

136, 157/ఎ పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ తర్వాత క్లియర్ చేయలేదన్నారు.  నిబంధనల ప్రకారంగా ఓట్ల లెక్కింపును చేపడుతామని ఆయన చెప్పారు. ప్రస్తుతం దుబ్బాకలో విజయం సాధించామని బీజేపీ సంబరాలు చేసుకొంటుంది. ఈ తరుణంలో మరోసారి వీవీప్యాట్ స్లిప్పులను లెెక్కిస్తున్నారు.

 

click me!