
హైదరాబాద్: Assembly వెల్‌లోకి వచ్చినందునే BJP MLAలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao తెలిపారు.అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత సోమవారం నాడు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మీడియా ప్రతినిధులతో Chit Chat చేశారు.
శాసనసభ వెల్ లోకి వస్తే సస్పెండ్ చేస్తామని గత BAC లో CM KCR చెప్పారని ఆయన గుర్తు చేశారు. వెల్ లోకి వచ్చినందునే బీజేపీ ఎమ్మెల్యే లు సస్పెండ్ అయ్యారని మంత్రి హరీష్ రావు చెప్పారు. Congress ఎమ్మెల్యేలు శాసనసభ వెల్ లోకి రాలేదన్నారు. అందుకే వారిని సస్పెండ్ చేయలేదని ఆయన గుర్తు చేశారు.
తమ స్థానం లో నిలబడి అడిగితేనే Rajya Sabha లో 12 మందిని సస్పెండ్ చేశారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. Delhiకి ఒక న్యాయం రాష్ట్రానికి ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. Suspend అవ్వాలని కావాలనే బీజేపీ ఎమ్మెల్యేలు వెల్ లోకి వచ్చారని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. గవర్నర్ ప్రసంగం,బడ్జెట్ స్పీచ్ సమయం లో వెల్ లోకి రావొద్దని మంత్రి గుర్తు చేశారు.