మాణిక్‌రావ్ ఠాక్రేతో రేవంత్ రెడ్డి భేటీ.. పార్టీలో చేరికలపై కీలక మంతనాలు..!!

Published : Apr 17, 2023, 02:04 PM IST
మాణిక్‌రావ్ ఠాక్రేతో రేవంత్ రెడ్డి భేటీ.. పార్టీలో చేరికలపై కీలక మంతనాలు..!!

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రేతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రేతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటనపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరికలపై నేతలు మంతనాలు జరిపారు. 

Also Read: నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సారంగపూర్ జెడ్పీటీసీ..

ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇరువురు నేతలతో కాంగ్రెస్ నాయకులు టచ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిని పార్టీలో చేర్చుకోవడం.. అందుకు వారిని ఒప్పించే అంశాలపై కూడా ఈ సమావేశంలో ఠాక్రే, రేవంత్, ఇతర ముఖ్య నేతల మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. మరోవైపు పొంగులేటి, జూపల్లిలకు బీజేపీ నేతలు కూడా గాలం  వేస్తున్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

యశోద ఆసుపత్రికి కేసీఆర్ | KCR To Visit Peddi Sudarshan Reddy | Yashoda Hospital
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేసీఆర్ | KCR Meets Peddi Sudarshan Reddy Family