ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైల్లో వేయకపోవునా?:హరీష్ రావు

By narsimha lode  |  First Published Oct 24, 2023, 4:23 PM IST

ఓటుకు నోటు కేసులో కేసీఆర్ తలుచుకుంటే  రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టకపోవునా  అని  తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.


హైదరాబాద్:కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేయకపోవునా..? అని  తెలంగాణ మంత్రి హరీష్ రావు  ప్రశ్నించారు.ఈ నెల  30వ తేదీన  ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభ విజయవంతం కోసం  బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని  మంగళవారంనాడు నారాయణఖేడ్ లో నిర్వహించారు.ఈ సమావేశంలో  మంత్రి హరీష్ రావు  కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ కి పనితనం తప్ప పగతనం లేదన్నారు. పక్క రాష్టాల్లో చూస్తున్నాం వాళ్ళు గెలవగానే వీళ్ళను జైలుకు పంపిస్తారు.వీళ్ళు గెలవగానే వాళ్ళని జైలుకి పంపిస్తారని హరీష్ రావు  చెప్పారు. ఏపీలో  చంద్రబాబు అరెస్ట్ నుద్దేశించి  మంత్రి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు.

Latest Videos

undefined

కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆయన విమర్శించారు.గతంలో రేవంత్ రెడ్డి టిడిపిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నారు. వాళ్ళ నాన్న చనిపోతే  అంత్యక్రియలు చేశాక స్నానం చేయడానికి కరెంట్ లేదని అసెంబ్లీలో చెప్పారన్నారు.ఆనాడు సోనియా గాంధీని బలి దేవత అన్నాడు, ఇటలీ బొమ్మ అన్నాడు నోటికి ఏదోస్తే అదే తిట్టారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. 

 కాంగ్రెస్ లో చేరిన తర్వాత  సోనియాగాంధీని రేవంత్ రెడ్డి దేవత అంటున్నాడన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలని ఆయన ఎద్దేవా చేశారు.ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం రేవంత్ రెడ్డి అని  సెటైర్లు వేశారు. 

also read:కోమటిరెడ్డి, వివేక్ వెంకటస్వామిలపై ఆపరేషన్ ఆకర్ష్: పార్టీలో చేరాలని కాంగ్రెస్ ఆహ్వానం

రాహుల్ గాంధీ వచ్చి నేను బీజేపీతో పోరాడుతా... బీజేపీపై పోరాడే డిఎన్ఏ నాది అంటున్నారన్నారు. మరి రేవంత్ రెడ్డి డిఎన్ఏ ఏదో రాహుల్ తెలుసుకోవాలని రాహుల్ గాంధీకి మంత్రి హరీష్ రావు సూచించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డిఎన్ఏ లు మ్యాచ్ కావట్లేదన్నారు.మేం ఎవ్వరికీ బీ టీం కాన్నారు. తెలంగాణ ప్రజలకే తాము బీ టీం అని  హరీష్ రావు తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికి ఒకటి కాదన్నారు.

click me!