Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్ కు మ‌రో షాక్.. కాంగ్రెస్ లోకి కీల‌క నేత‌లు

Published : Oct 24, 2023, 03:54 PM IST
Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్ కు మ‌రో షాక్.. కాంగ్రెస్ లోకి కీల‌క నేత‌లు

సారాంశం

Kodad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు టిక్కెట్టు ఆశించినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో త‌మ అస‌మ్మ‌తిని వెల్ల‌డిస్తూ.. ఇత‌క పార్టీల్లోకి వెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితికి గ‌ట్టి షాక్ త‌గిలింది. కోదాడలో కాంగ్రెస్‌లోకి  1,000 మంది ముఖ్య బీఆర్‌ఎస్ నేతలు వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో డీసీసీబీ మాజీ చైర్మన్ బూర పుల్లారెడ్డి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ మహబూబ్ జానీలు ఉన్నారు. అలాగే, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వీ చందర్‌రావు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లారు.   

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు టిక్కెట్టు ఆశించినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో త‌మ అస‌మ్మ‌తిని వెల్ల‌డిస్తూ.. ఇత‌క పార్టీల్లోకి వెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితికి గ‌ట్టి షాక్ త‌గిలింది. కోదాడలో కాంగ్రెస్‌లోకి  1,000 మంది ముఖ్య బీఆర్‌ఎస్ నేతలు వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో డీసీసీబీ మాజీ చైర్మన్ బూర పుల్లారెడ్డి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ మహబూబ్ జానీ ఉన్నారు. అలాగే, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వీ చందర్‌రావు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లారు.

వివ‌రాల్లోకెళ్తే.. కోదాడలో కాంగ్రెస్‌కు బూస్ట్‌గా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేనేప‌ల్లి చందర్‌రావుతో పాటు సుమారు 1000 మంది ద్వితీయశ్రేణి బీఆర్‌ఎస్ నేతలు నల్గొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన భార్య పద్మావతి రెడ్డి 2014లో కోదాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో డీసీసీబీ మాజీ చైర్మన్ బూర పుల్లారెడ్డి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ మహబూబ్ జానీ ఉన్నారు.

2018లో స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందిన బొల్లం మల్లయ్య యాదవ్‌ను మార్చాలనే తమ డిమాండ్‌ను పట్టించుకోకుండా బీఆర్‌ఎస్‌ తన స్థానంలో నిలబెట్టిందని వాపోయారు. కోదాడలో 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్