ధాన్యం కొనుగోలు, మెడికల్ కాలేజీల వ్యవహారం.. తమిళిసై, కేంద్రానికి హరీశ్ రావు కౌంటర్

Siva Kodati |  
Published : Mar 05, 2023, 04:30 PM IST
ధాన్యం కొనుగోలు, మెడికల్ కాలేజీల వ్యవహారం.. తమిళిసై, కేంద్రానికి హరీశ్ రావు కౌంటర్

సారాంశం

మెడికల్ కాలేజ్‌లు, ఇతర అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కౌంటరిచ్చారు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు.   

మెడికల్ కాలేజ్‌లు, ఇతర అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కౌంటరిచ్చారు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. మెడికల్ కాలేజీలకు సంబంధించి కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆయన దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నిధులతో తామే 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వడ్లు కొనకపోయినా రాష్ట్రం కొంటోందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ ప్రఫభుత్వం వచ్చాక రూ.400 వున్న గ్యాస్ రూ.1200 అయ్యిందని హరీశ్ ఎద్దేవా చేశారు. 

ALso REad: కొత్త పీఆర్‌సీని ఏర్పాటు చేయాలి: కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ

బీజేపీ నాయకులు దండుకుంటారు తప్పించి ప్రజలకు సేవ చేయరని మంత్రి ఆరోపించారు. బీజేపీ చేసింది ఏమైనా వుందా అంటే అది పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడమేనని హరీశ్ రావు చురకలంటించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా హరీశ్ రావు మండిపడ్డారు. తానే అన్నం తినడం నేర్పానని చంద్రబాబు అనడం విడ్డూరంగా వుందన్నారు. తెలంగాణలో ఇప్పుడు రైతు రాజ్యం నడుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు జొన్న గట్క, మక్క గట్క తప్ప ఏమీ తినలేదని చంద్రబాబు అంటున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం