సిద్దిపేటలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌పై దాడి: ఖండించిన మంత్రి హరీష్ రావు

By narsimha lodeFirst Published Nov 2, 2020, 10:01 PM IST
Highlights

దుబ్బాకలో టి ఆర్ ఎస్  కి ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి  ఓర్వలేక బిజేపీ నాయకులు పని గట్టుకొని ఎమ్మెల్యేపై బౌతిక దాడులకు దిగడాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.
 

సిద్దిపేట:దుబ్బాకలో టి ఆర్ ఎస్  కి ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి  ఓర్వలేక బిజేపీ నాయకులు పని గట్టుకొని ఎమ్మెల్యేపై బౌతిక దాడులకు దిగడాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.

 నియోజకవర్గం అవతల ప్రాంతంలో ఉన్న ఒక దళిత ఎమ్మెల్యే పై భౌతిక  దాడులకు దిగడం చాలా శోచనీయమన్నారు.. ఇది హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన నేతలు ఉన్న హోటల్ కు వెళ్లి భౌతిక దాడులకు పాల్పడటం బీజేపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు.

 మాజీ ఎంపీ , దుబ్బాక  బిజెపి ఎన్నికల ఇంచార్జ్  జితేందర్ రెడ్డి రామాయం పేట లోని రెడ్డి కాలనీ లో ఉంటే తప్పు లేనేది ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సిద్దిపేట లో ఉంటే తప్పు ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది ఉద్దేశ పూర్వ క మైన దాడిగా ఆయన చెప్పారు.

also read:సిద్దిపేటలో ఉద్రిక్తత: బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

 శాంతి భద్రతలకు బిజెపి నాయకులు  విఘాతం కలిగిస్తున్నారన్నారు. దాడికి ముందు 15 నిమిషాల ముందే పోలీస్ వాళ్ళు వచ్చి తనిఖీ చేసుకొని వెళ్లిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.టి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు , పార్టీ శ్రేణులు సమయమనం పాటించి ఎవరీ పనుల్లో వారు నిమగ్నం కావాలని ఆయన కోరారు. 

 చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన చెప్పారు.

click me!