కేసీఆర్ వెంటనే ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా నడుస్తారని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమటాకర్ చెప్పారు. త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ ప్రకటన చేస్తారని చెప్పారు.
కరీంనగర్: జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ త్వరలోనే ప్రకటన చేస్తారని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఆదివారం నాడు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తో కలిసి వైఎస్ జగన్ కూడా నడుస్తారని ఆయన తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. దేశం మంచి కోరే ప్రతి ఒక్కరూ కేసీఆర్ తో నడవాలని ఆయన కోరారు. ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకించే అన్ని పార్టీల నేతలను కేసీఆర్ కలుస్తారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.#
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. జాతీయ పార్టీ కోసం సన్నాహలు చేసుకుంటున్నారు. హైద్రాబాద్ కేంద్రంగా జాతీయ పార్టీని ఏర్పాటును కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ జిల్లా పార్టీల అధ్యక్షులు కేసీఆర్ ను కోరారు. హైద్రాబాద్ లో అందుబాటులో ఉన్న టీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని కోరారు.
undefined
కొంత కాలంగా బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా కేసీఆర్ పై అదే స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. 2024 లో జరిగే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని కేసీఆర్ చెబుతున్నారు. బీజేపీ ముక్త్ భారత్ దిశగా తమ పోరాటం ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం భావసారూప్యత గల పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఢిల్లీ , బీహర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేసీఆర్ చర్చలు జరిపారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలతో కూడా కేసీఆర్ చర్చించారు. 2024 ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీయే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. ఇటీవల నిజామాబాద్ లో నిర్వహించిన సభలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు జాతీయ రాజకీయాల్లోకి కీలకపాత్ర పోషించనున్నట్టుగా కేసీఆర్ నిజామాబాద్ వేదికగానే ప్రకటించారు.
also read:త్వరలోనే జాతీయ పార్టీ: హైద్రాబాద్ వేదికగానే పార్టీ పేరును ప్రకటించనున్న కేసీఆర్
దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితిపై కేసీఆర్ నివేదికలను తెప్పించుకుంటున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో గతంలో పలు దఫాలు ఈ విషయమై కేసీఆర్ చర్చించారు. గత మాసంలో దేశంలోని రైతు సంఘాల ప్రతినిధులు తెలంగాణలో పర్యటించారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలను రైతు సంఘాల ప్రతినిధులు కూడా పరిశీలించారు. ఈ తరహా పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేసీఆర్ ను రైతు సంఘాల ప్రతినిధులు కోరిన విషయం తెలిసిందే. జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్ పలువురు మేథావులు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.