గంగులకు తప్పిన ప్రమాదం: చెర్లబూట్కూర్‌లో కుప్పకూలిన వేదిక, మంత్రికి గాయాలు (వీడియో)

Published : Apr 16, 2023, 02:32 PM ISTUpdated : Apr 16, 2023, 04:56 PM IST
గంగులకు  తప్పిన  ప్రమాదం: చెర్లబూట్కూర్‌లో కుప్పకూలిన వేదిక, మంత్రికి గాయాలు (వీడియో)

సారాంశం

తెలంగాణ మంతరి  గుంగుల కమలాకర్ కు గాయాలయ్యాయి.  చెర్లబూట్కూర్ లో  సభా వేదిక కూలడంతో  మంత్రి  కమలాకర్ గాయపడ్డారు.  

కరీంనగర్: రాష్ట్ర పౌరసరఫరాల  శాఖ మంత్రి  గంగుల కమలాకర్ కు  ఆదివారంనాడు  ప్రమాదం తప్పింది.  జిల్లాలోని చెర్లబూట్కూర్ లో  సభా వేదిక కుప్పకూలడంతో  మంత్రి గంగుల కమలాకర్ సహా  ఇతర నేతలు  కిందపడిపోయారు.  ఈ ప్రమాదంలో మంత్రి కమలాకర్  సురక్షితంగా  బయటపడ్డారు.  మంత్రి  గంగుల కమలాకర్ కు  గాయాలయ్యాయి. 

వేదికపై  పరిమితికి మించి ఎక్కడంతో  సభా వేదిక కుప్పకూలింది.   దీంతో  మంత్రి సహా  సభా వేదికపై  ఉన్న వారంతా కిందపడ్డారు.  ఈ ప్రమాదంలో  జడ్‌పీ‌టీసీ సభ్యుడికి గాయాలయ్యాయి.   జడ్‌పీటీసీ సభ్యుడిని  ఆసుపత్రికి తరలించారు. 

ప్రాధమిక చికిత్స  చేశారు: మంత్రి గంగుల 

సభా వేదికపై  నుండి కింద పడ్డ ఘటనలో   తనకు  చిన్న చిన్న గాయాలైనట్టుగా మంత్రి కమలాకర్ చెప్పారు.  ప్రాథమిక చికిత్స  చేశారని  చెప్పారు.  ఆందోళన చెందాల్సిన  అవసరం లేదని మంత్రి కమలాకర్ ప్రకటించారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని  మంత్రి  గంగుల కమలాకర్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?