ఎంపీటీసీపై దాడి చేసిన ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ చేపట్టాల్సిన దీక్షను ఉత్తమ్ కుమార్ రెడ్డి వాయిదా వేసుకున్నారు. సూర్యాపేట ఎస్పీ వినతి మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డ దీక్షను వాయిదా వేసుకున్నారు. .
కోదాడ: ఎంపీటీసీ పై దాడిని నిరసిస్తూ ఆదివారంనాడు చేపట్టాల్సిన దీక్షు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాయిదా వేసుకన్నారు. సూర్యాపేట ఎస్‌సీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు.
ఈ నెల 14వ తేదీన మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్రం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమయంలో జై భీమ్ అంటే ఏమిటని ఎంపీటీసీ ప్రశ్నించారు. ఎంపీటీసీపై ఎస్ఐ లోకేష్ దాడికి దిగాడు. ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డికి గాయాలయ్యాయి. ఈ ఘటనను నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయై తెలంగాణ డీజీపీకి ఈ నెల 15న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఐపై చర్యలు తీసుకోకపోతే ఇవాళ దీక్ష చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవాళ సూర్యాపేట ఎస్పీ ఫోన్ చేశారు. మునగాల ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్టుగా కోరారు. ఇవాళ దీక్షను వాయిదా వేసుకోవాలని ఎస్పీ కోరారు. ఎస్పీ వినతి మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ కోదాడలో తలపెట్టిన దీక్షను వాయిదా వేసుకున్నారు.