మెడికో ప్రీతి ఆరోగ్యంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Feb 26, 2023, 4:35 PM IST
Highlights

మెడికో  ప్రీతిని వేధింపులకు గురి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  చెప్పారు. 
 

హైదరాబాద్: మెడికో ప్రీతి  ఆరోగ్య పరిస్థితి విషమంగా  ఉందని తెలంగాణ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్   రావు  చెప్పారు. ఆదివారం నాడు  ఉమ్మడి వరంగల్ జిల్లాలో  జరిగిన  కార్యక్రమంలో  మంత్రి దయాకర్ రావు  ప్రసంగించారు. మెడికో  ప్రీతిని  కాపాడేందుకు  వైద్యులు  తీవ్రంగా  ప్రయత్నిస్తున్నారని  ఆయన  చెప్పారు.  మెడికో ప్రీతి బతికే అవకాశం ఒక్క శాతమే ఉందన్నారు.  ప్రీతిని  చూస్తే  చాలా బాధ కలుగుతుందన్నారు. ప్రీతి త్వరగా కోలుకోవాలని  దేవుడిని  ప్రార్ధిస్తున్నట్టుగా  చెప్పారు.   మెడికో ప్రీతిని వేధించిన  నిందితులను   కఠినంగా శిక్షిస్తామని  ఆయన  హెచ్చరించారు.

ఈ నెల  22వ తేదీన  మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం  చేసుకుంది.   వరంగల్ కేఎంసీలో  మెడికో గా  ప్రీతి పనిచేస్తుంది.  సీనియర్  సైఫ్ వేధింపుల కారణంగానే  ఆమె ఆత్మహత్య చేసుకుందని  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం  సైఫ్ ను పోలీసులు అరెస్ట్  చేసి రిమాండ్ కు తరలించారు.

ఈ నెల  22వ తేదీన  మెడికో ప్రీతి ఆత్హహత్యాయత్నం  చేసుకుంది.   వరంగల్ కేఎంసీలో  మెడికో గా  ప్రీతి పనిచేస్తుంది.  సీనియర్  సైఫ్ వేధింపుల కారణంగానే  ఆమె ఆత్మహత్య చేసుకుందని  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం  సైఫ్ ను పోలీసులు అరెస్ట్  చేసి రిమాండ్ కు తరలించారు.   సైఫ్ వేధింపుల కారణంగానే  మెడికో  ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసుకుందని  పోలీసులు అనుమానిస్తున్నారు.  

సైఫ్ వేధింపుల గురించి  మెడికో ప్రీతి పేరేంట్స్   ప్రిన్సిపల్ కు ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  ప్రిన్సిపల్  సైఫ్, మెడికో ప్రీతిని పిలిపించి మాట్లాడారు. సైఫ్ వేధింపుల గురించి తల్లితో  మెడికో  మాట్లాడింది.ఈ ఆడియో సంభాషణ వెలుగు చూసింది.  

also read:చదవాలంటే భయమేస్తుంది: సైఫ్ వేధింపులపై వెలుగులోకి మెడికో ప్రీతి ఆడియో సంభాషణ

మెడికో ప్రీతి  ఆత్మహత్యాయత్నంపై  ప్రొఫెసర్ల బృందం  ప్రభుత్వానికి నివేదిక  ఇచ్చింది.  ఇప్పటికే సైఫ్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   సైఫ్ పై   ఆరోపణలు  రుజువైతే  ఆయనపై బహిష్కరణ  అస్త్రం కూడా ప్రయోగించే అవకాశం ఉందని  చెబుతున్నారు. 

గత నాలుగు మాసాలుగా  ఉద్దేశ్యపూర్వకంగా  మెడికో ప్రీతిని లక్ష్యంగా  చేసుకొని సైఫ్ వేధింపులకు పాల్పడ్డారని వరంగల్ సీపీ రంగనాథ్  రెండు రోజుల క్రితం  ప్రకటించారు ఈ విషయమై  వాట్సాప్  చాటింగ్ లను  ఆధారాలుగా  ఆయన  చెప్పారు. తమ దర్యాప్తులో  వాట్సాప్ చాటింగ్ లను  గుర్తించినట్టుగా  ఆయన   వివరించారు. 

click me!