తెలంగాణలో భారీగా మావోయిస్టులు అరెస్ట్... ఆయుధాలు స్వాధీనం

Published : May 17, 2025, 10:50 PM IST
తెలంగాణలో భారీగా మావోయిస్టులు అరెస్ట్... ఆయుధాలు స్వాధీనం

సారాంశం

పోలీసులు భారీగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద INSAS, SLR, .303 రైఫిల్స్, గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.    

Telangana : తెలంగాణలోని ములుగు జిల్లాలో పోలీసులు నిషేధించబడిన CPI (మావోయిస్ట్) సంస్థకు చెందిన 20 మంది సభ్యులను అరెస్టు చేసారు. వీరివద్ద పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని అధికారులు శనివారం తెలిపారు. మే 16, 17 తేదీల మధ్య వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిపిన తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టయిన వారిలో ఒక డివిజన్ కమిటీ సభ్యుడు, ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారని ములుగు ఎస్పీ శబరిష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల్లో తలదాచుకున్న మావోయిస్టు కేడర్లు 'సిఆర్ఫిఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసుల సంయుక్త కార్యకలాపాల కారణంగా చిన్న చిన్న గుంపులుగా చెల్లాచెదురుగా పారిపోతున్నారనే నిఘా సమాచారం మేరకు ఈ అరెస్టులు జరిగాయి.

తెలంగాణ పోలీసులు నిఘాను పెంచి, పారిపోతున్న మావోయిస్టులను అడ్డుకుని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తులు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో పోలీసులు, CRPF సిబ్బందిపై దాడులు, హత్యలు, పోలీసు ఇన్ఫార్మర్లుగా అనుమానించబడిన పౌరులను హతమార్చడం వంటి అనేక హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మూడు 5.56 mm INSAS రైఫిల్స్, నాలుగు 7.62 mm SLR రైఫిల్స్, ఒక 303 రైఫిల్, నాలుగు 8 mm రైఫిల్స్, రెండు లైవ్ గ్రెనేడ్లు, అనేక మ్యాగజైన్‌లతో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ (ములుగు జిల్లా), ఛత్తీస్‌గఢ్ (బీజాపూర్ జిల్లా) పోలీసుల పరిధిలోని కర్రేగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా దళాలను అడ్డుకునేందుకు, గెరిల్లా జోన్‌ను ఏర్పాటు చేసేందుకు మావోయిస్టులు IEDలు పాతిపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఏప్రిల్ 8న ఆదివాసీ గ్రామస్తులు, స్థానికులను అటవీ ప్రాంతంలోకి ప్రవేశించవద్దని ఈ గుంపు హెచ్చరించింది.

మే 11న ముగిసిన తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భద్రతా దళాలు 21 రోజుల పాటు నిర్వహించిన 'బ్లాక్ ఫారెస్ట్' ఆపరేషన్ తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో 16 మంది మహిళలు సహా 31 మంది మావోయిస్టులు మరణించారు. దాదాపు 450 IEDలు, రెండు టన్నుల పేలుడు పదార్థాలు, అనేక రైఫిల్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఆధిపత్యానికి గట్టి దెబ్బ అని భద్రతా దళాలు అభివర్ణించాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సీఐడీ విచారణకు Padi Kaushik Reddy | Sammakka-Saralamma Jatara Case | BRS MLA | Asianet News Telugu
CM Revanth Reddy Speech: ఈలోపం దేశ భవిష్యత్తుకు చాలాఇబ్బందికరం | AI Challenges | Asianet News Telugu