ఉపాధి కోసం దుబాయి వెళ్లి.. కరోనాతో కరీంనగర్ వాసి మృతి

By telugu news teamFirst Published May 14, 2020, 7:38 AM IST
Highlights

డ్యూటీకి వెళ్లి తన గదికి చేరుకున్నయాకోబ్ సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతని స్నేహితులు అక్కడే ఉన్న ఆసుపత్రికి తరలించారు. 

జీవనోపాధి కోసం సొంత ఊరు, కన్నవారిని వదులుకొని పరాయి దేశం వెళ్లాడు. అక్కడ కరోనా మహమ్మారి విజృంభించింది. కనీసం స్వదేశానికి కూడా చేరలేదు. ఆలోపో కరోనా అతనిని కమ్మేసింది. కరోనా వైరస్ సోకి ఓ వలస కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...జగిత్యాల జిల్లాకు చెందిన మరో వలస కార్మికుడు కరోనా సోకి మృతిచెందాడు. దుబాయ్ దేశంలో ఉపాధి పొందుతున్న యాకోబ్ మంగళవారం చనిపోయినట్టు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. 

జిల్లాలోని మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన శింగారపు యాకోబ్ గత కొంతకాలంగా దుబాయ్ లోని అల్గోజ్ లోని ఓ కంపెనీ లో పని చేస్తున్నాడు. డ్యూటీకి వెళ్లి తన గదికి చేరుకున్నయాకోబ్ సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతని స్నేహితులు అక్కడే ఉన్న ఆసుపత్రికి తరలించారు. 

మొదట గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని భావించిన వైద్యులు కరోనాను దృష్టిలో పెట్టుకుని టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడి మృత దేహాన్ని అక్కడే ఖననం చేశారు. 

యాకోబ్ కు భార్య మరియమ్మ, జోసఫ్, కిరణ్ ఇద్దరు కొడుకులు ఉన్నారు. యాకోబ్ మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారం రోజుల‌ క్రితం కోరుట్ల మండలం మోహాన్ రావుపేట్ కు చెందిన ఓ వ్యక్తి కూడా కరోనాతో మృతి చెందాడు.

click me!