Revanth Reddy: టార్గెట్ 14.. రేవంత్ రెడ్డి వ్యూహమిదేనా..?

By Rajesh KarampooriFirst Published Apr 5, 2024, 4:48 PM IST
Highlights

CM Revanth Loksabha Elections Plan: పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలో ఆచూతూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్. పార్టీ బలోపేతానికి పరంగా జోరుగా చేరికలు కొనసాగుతోంది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహామేంటి? 
 

CM Revanth Loksabha Elections Plan: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు  బీఆర్‌ఎస్‌,బీజేపీలు  17 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. ఇక అధికార కాంగ్రెస్‌ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వలె.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా  మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా  హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

దశలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కనీసం 14 స్థానాల్లోనైనా విజయకేతనం ఎగరేయాలని కసరత్తులు చేస్తోంది. ఇప్పటివరకు  అభ్యర్థులను ప్రకటించినా.. అధిష్టానం గెలుపు కోసం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఆదేశాల మేరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులు, సీనియర్‌ నేతలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు.  

17 లోక్‌సభ స్థానాలలో కనీసం 14 స్థానాల్లో గెలవాలని తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా వ్యవహరిస్తోన్నారు. ఓటమన్నదే ఎరుగని కేసీఆర్‌నే గద్దె దించిన ఉత్సాహంలో ఉన్న రేవంత్ రెడ్డి అదే ఉత్సాహంతో ముందుకు సాగుతోన్నారు.  తన ప్రభుత్వం (తెలంగాణ ప్రభుత్వం)లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అమలు చేస్తున్న గ్యారెంటీలు చూపిస్తు ముందు సాగాలని భావిస్తోన్నారు. అదే సమయంలో పార్టీ బలోపేతానికి జారీ ఎత్తున చర్యలు చేస్తోన్నారు. అదే విధంగా  జోరుగా చేరికలు కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి..  ఈ పార్లమెంట్ పోరులో భారీ సీట్లలో విజయ సాధించాలని భావిస్తోన్నారు.  

మాములుగానే సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో వెళ్తుంటారు. ఇక పార్లమెంట్ ఎన్నికలంటే.. మామూలుగా ఉండదు. అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాలను ఆధారంగా ఈ ఎన్నికల్లో ముందుకు సాగాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈమేరుకు పక్కా ప్లాన్ ప్రకారం వ్యూహాలను అమలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎక్కడ సభలు నిర్వహించి సక్సెస్ అయ్యారో అదే ప్రాంతంలో సభను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది అధిష్టానం. ఈ మేరకు తొలి భారీ  సమావేశం తుక్కుగూడలో జనజాతర పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అలాగే ఈ ఎన్నికల నేపథ్యంలో  సీఎం రేవంత్ తరుచు ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. పార్టీ గెలుపు కోసం.. నేతలందరూ కలిసికట్టుగా ఉండాలనీ, బాధ్యతలను పంచుకోవాలనీ,  కార్యకర్తలకు అండగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశాలిచ్చారంట. అంతేకాదు.. అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలనీ,  పార్లమెంట్‌, అసెంబ్లీ, బూత్‌ స్థాయిలో కమిటీలు వేయాలని సూచించారు. ఇలా రాష్ట్రవ్యాప్తం ప్రణాళిక బద్దంగా ఎన్నికల నిర్వహణ కొనసాగాలని మార్గనిర్ధేశం చేశారు.

అసలు సమస్య ఇదే.. 

కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ఇతర పార్టీల బడా లీడర్లు తమపార్టీలను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది పార్టీ బలోపేతానికి కీలకమే అయినా.. అసలు సమస్య ఇక్కడే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కాకుండా.. తీరా అధికారం లోకి వచ్చినా తరువాత పార్టీలో చేరిన అవకాశం కల్పిస్తున్నారని, పార్టీ విజయం సాధించిన క్రుషి చేసిన పాతవారికి కాకుండా.. కొత్తవారు అవకాశం కల్పిస్తున్నారనే అసంత్రుప్తి కనిపిస్తోంది.  ఈ విషయంపై సీఎం రేవంత్ పెట్టి ముందుకు సాగాలని, పార్టీ బలోపేతం, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఈగోలను పక్కన పెట్టి, పార్టీ గెలుపులో అందరూ భాగస్వామ్యం అయ్యేలా చూసుకోవాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

ఈ  విషయంలో సీఎం రేవంత్ చాలా వరకు విజయ సాధించారనే చెప్పాలి.గతంలో ఇలాంటి సమస్యలను అధిగమించినా అనుభవం  ఉందనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో  అంతర్గత విబేధాలు, కుమ్ములాటలు ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పనైపోయిందని  చాలా మంది భావించారు. ఈ అవరోధాలను అధిగమించి, పార్టీని గెలుపు బాటలో ప్రయాణించేలా చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అందుకే ఈసారి ముందే మేలుకున్నారు. పార్టీలో అంతర్గ కుమ్ములాటలకు దారి ఇవ్వకుండా కీలక నేతలతో భేటీ అయ్యారు. కీలక నేతలందరిని పిలిచి  పనిచేయాలని మార్గదర్శనం చేస్తున్నారు.

మరోవైపు.. ప్రచారంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అక్రమాలు, కల్వకుంట్ల భూ కబ్జాలు, ఇలా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగాన్ని ప్రజల్లోకి విస్త్రుతంగా తీసుకెళ్లాలని భావిస్తోన్నారు. అదే సమయంలో వంద రోజుల్లో కాంగ్రెస్‌ సర్కార్‌ చేసిన పనులను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. దీనికి తోడు.. ప్రచారంలో ఢిల్లీ పెద్దలు కూడా పాల్గొన్నారు. ఇలా ప్రతి విషయాన్ని  అనుగుణంగా తమకు మార్చుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తోన్నారు. ఏదిఏమైనా.. తెలంగాణలో మరోసారి కాంగ్రెస్‌ విజయకేతనం ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. 

click me!