Telangana Local Body Elections: ఆరు స్థానాలకు డిసెంబర్ 10న ఎన్నికలు

By narsimha lodeFirst Published Nov 26, 2021, 3:40 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.


హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం గడువు ముగిసింది.  రాష్ట్రంలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి..  మరో ఆరు స్థానాలకు డిసెంబర్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణ రాష్ట్రంలోని  12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం  ఈ నెల 9వ తేదీన షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 16న Telangana Local Body Elections  ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.   12 స్థానాల్లో ఆరు స్థానాలను  Trs ఏకగ్రీవంగా గెలుచుకొంది. మిగిలిన ఆరు స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి.రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు , నిజామాబాద్, వరంగల్ , మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. 

నిజామాబాద్ నుండి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి జిల్లా నుండి శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్ నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ నుండి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డి,లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లోని ఒక్కొక్క స్థానానికి, కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బలం ఉంది. ఈ ఆరు స్థానాలను ఆ పార్టీ గెలుపొందనుంది. అయితే కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీకి చెందిన మాజీ మేయర్  బరిలో నిలవడంతో ఆ పార్టీ తన అభ్యర్ధులను  క్యాంప్ నకు తరలించింది.  మరోవైపు  కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లాలో బలం ఉంది. గతంలో ఈ స్థానం నుండి కాంగ్రెస్ విజయం సాధించింది. 

నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరకు ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థుల్లో ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పిటిసిలు కాగా మిగతావారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిటిసిలు.నిన్న ఒకరు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న వారిలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పిటిసి కుడుదుల నగేష్ కూడా ఉన్నారు.

also read:తిరిగి ఎమ్మెల్సీగా ఏకగ్రీవం... తల్లితో కలిసి అష్టలక్ష్మి అమ్మవారికి కవిత ప్రత్యేక పూజలు

దీంతో మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా అందులో ముగ్గురివి స్క్రూటినీలో ఎగిరిపోయారు. మిగిలిన వారిలో ఒక్కరు ఉప సంహరణ చేసుకోగా తుది జాబితాలో ఏడుగురు అభ్యర్థులు మిగిలారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన  కల్వకుంట్ల కవిత ఇవాళ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి ధృవీకరణ పత్రం అందుకొన్నారు.  ఇవాళ ఉదయం ఆమె హైద్రాబాద్ అష్టలక్ష్మి ఆలయంలో తల్లితో కలిసి పూజలు నిర్వహించారు. పోటీలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కొందరు ఇండిపెండెంట్లు తమ నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు. దీంతో ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ ఏకగ్రీవంగా విజయం సాధించింది. 

ఇటీవలనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆరు స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, ఆకుల లలిత, బండా ప్రకాష్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డిలు ఏకగ్రీవంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఆరుగురు కూడా ఎన్నికల అధికారుల నుండి ధృవీకరణ పత్రాలను స్వీకరించారు. 

click me!