తెలంగాణ లైబ్రరీలలో ఎన్నిపుస్తకాలున్నాయో తెలుసా?

First Published Oct 18, 2017, 4:06 PM IST
Highlights

నిరుద్యోగులకు ఉపయోగపడే కేంద్రాలుగా తెలంగాణ లైబ్రరీలు

తెలంగాణ గురించి ఒక కొత్త విషయం ఈ రోజు వెల్లడయింది. వెల్లడించింది ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. తెలంగాణలో మొత్తం 676 గ్రంథాలయాలున్నాయి. వాటిలో 68 లక్షల పుస్తకాలున్నాయి. ఈ విషయాన్ని ఆయన ఈ రోజు వరంగల్ లో చెప్పారు. వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా అజీజ్ ఖాన్ బాధ్యతలు  స్వీకారం ఉత్సవానికి ఆయన  ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇక్కడ మాట్లాడుతూ తాను విద్యా శాఖ మంత్రి అయ్యాక గ్రంధాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని, పుస్తకాలు డిజిటలైజ్ చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే వై ఫై సేవలు కూడా కల్పించే ఆలోచన చేస్తుతున్నామని చెప్పారు. గ్రంధాలయాల్లో నిరుద్యోగ యువతకు కావాల్సిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నామని ఉపముఖ్యమంత్రి కడియం తెలిపారు.

‘‘పూర్వం నేను వరంగల్ సెంట్రల్ లైబ్రరీకి రెగులర్ గా వెళ్లి చదువుకునేవాన్ని. అయితే గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల గ్రంధాలయం  శిథిలావస్థకు చేరుకుంది. దీనితో పాటు రీజినల్ లైబ్రరీ కూడా అదే పరిస్థితి లో ఉంది. ఈ రెండిటి మరమ్మతులు, ఆధునీకరణ కోసం 1.71 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నాను,’ అని ఆయన  ప్రకటించారు.

click me!