కేసిఆర్ 6 రేవంత్ రెడ్డి 9

Published : Oct 17, 2017, 07:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
కేసిఆర్ 6 రేవంత్ రెడ్డి 9

సారాంశం

కేసిఆర్, రేవంత్ పోటా పోటీ లక్కీ నెంబర్లపై హాట్ టాపిక్  

రాజకీయాల్లో ఎవరి నమ్మకాలు వారికుంటాయి. ఎవరి విశ్వాసాల ప్రకారం వారు నడుచుకుంటారు. కొందరు వాస్తు, జ్యోతిష్యం లాంటివాటిని నమ్ముతారు. మరికొందరు అస్సలు నమ్మరు. కొందరు కొద్ది కొద్దిగా నమ్ముతారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తెలంగాణ రాజకీయాల్లో రెండు విషయాలు మాత్రం ఆసక్తిని రేపుతున్నాయి. మరి ఆ రెండు విషయాలేమిటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సిఎం కేసిఆర్ లక్కీ నెంబరు 6. ఆయన ఇప్పటి వరకు అదే అదృష్ట అంకెతో చెలామణి అయ్యారు. ఆయన ఏది చేసినా 6 రావడం కోసం తాపత్రయపడతారు. కారు నెంబరు 6 ఉండేలా చూసుకుంటారు. కొన్నిసార్లు ఎక్కువ నెంబర్లు వస్తే అన్నీ కూడితే 6 రావాల్సిందే అంటారు. కేసిఆర్ దైనందిన జీవితంలో ప్రతీది కూడా 6తో ముడిపడి ఉండేలా చూసుకుంటారు. ఫోన్ నెంబరు కూడా 6 ఉండేలా చూసుకుంటారు. కేసిఆర్ ఒక్కరే కాదు కేసిఆర్ కుటుంబసభ్యులు కూడా 6 నెంబరు నే ఇష్టపడేవారు. హరీష్ రావు, కేటిఆర్, కవిత, సంతోష్ కుమార్ వీళ్లంతా ఆరు నెంబరు ఫోన్లు, కార్ల నెంబర్లను వాడుతున్నారు. అంతెందుకు కేసిఆర్ పిఎలు, పిఆర్ఓలు, గన్ మెన్లు, వాళ్ల వద్ద పనిచేసే వాళ్లందరూ 6 నెంబరు కలిసేలా ఫోన్లు, కార్ల నెంబర్లు సెలెక్ట్ చేసుకుంటారంటే ఆశ్చర్యం కాదు. ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న సమయంలోనూ సీట్ల సంఖ్యలో కూడా 6 వచ్చేలా వ్యవహారం నడుపుతారు. ఉమ్మడి రాష్ట్రంలో టిఆర్ఎస్ తీసుకున్న మంత్రి పదవులు కూడా ఆరే. ఎన్నికల పొత్తులో భాగంగా పోటీ చేసిన ఎంపి సీట్ల సంఖ్య ఆరే. ఇలా ఏ విషయంలోనైనా కేసిఆర్ ను ఆరును వేరు  చేసి చూసే వాతావరణం ఉండదు.

తెలంగాణ ఉద్యమ నేతగా కేసిఆర్ అదృష్ట సంఖ్య 6తో ఢిల్లీలో అడుగు పెట్టారు. ఢిల్లీ రాజకీయాల్లో వ్యవహారాలు నడిపిన సందర్భంలోనూ కేసిఆర్ తన 6 నెంబర్ పట్ల జాగ్రత్తలు వహించారు. కాంగ్రెస్ అధిష్టానం వద్దకు కేసిఆర్ 6 అనే లక్కీ నెంబర్ ద్వారా దగ్గరయ్యారు. తుదకు తెలంగాణ సాధించేవరకు కాంగ్రెస్ ను నిద్రపోనీయలేదు. తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితులు కల్పించారు కేసిఆర్. కాంగ్రెస్ అధిష్టానం కూడా కేసిఆర్ లక్కీ నెంబరు 6 అనే విషయాన్ని గుర్తించింది. కానీ టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసిఆర్ కాంగ్రెస్ పెద్దలను నమ్మించారు. కేసిఆర్ మాటలను కాంగ్రెస్ అధిష్టానం నమ్మినప్పటికీ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. కేసిఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ లో విలీనం ప్రశ్నే లేదని, పొత్తు ప్రసక్తి కూడా అసలే లేదని ప్రకటించారు. అంతిమంగా తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి అధికారం హస్తగతం చేసుకున్నారు. ఇదంతా జరిగిన చరిత్ర. మరి జరుగుతున్న తాజా పరిణామాలను కూడా ఒకసారి పరిశీలిద్దాం.

ఇక రేవంత్ లక్కీ నెంబరు 9. ఆయన వాడే కారు నెంబరు 9 ఉండాల్సిందే. మాట్లాడే ఫోన్ నెంబరు కూడా 9 పక్కాగా ఉంటది. రేవంత్ కూడా వీలైనంత వరకు లక్కీ నెంబరు ప్రకారమే ఫాలో అవుతారు. ఒకవేళ 9 నెంబరు రాకపోయినా కేసిఆర్ మాదిరిగానే అన్నీ కలిపితే 9 వచ్చేలా రేవంత్ జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విషయంలో రేవంత్ కూడా వాస్తును, సంఖ్యా శాస్త్రాన్ని బలంగా నమ్ముతారని తన అనుచరులు చెబుతుంటారు. అయితే కేసిఆర్ ఏదైతే 6 నెంబరుతో ఢిల్లీలో అడుగు పెట్టారో అదేరీతిలో రేవంత్ 9 లక్కీ నెంబరుతో ఢిల్లీలో కాలు మోపారు. కేసిఆర్ కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరైంది 6 లక్కీ నెంబరుతో అయితే రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 9 లక్కీ నెంబరును ఎంచుకున్నారు.

అంతేకాకుండా రేవంత్ డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ లో చేరేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. డిసెంబరు 9 తేదీకి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, తెలంగాణ ఏర్పాటుకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తేదీ డిసెంబరు 9 కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అదే తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఈ ముహూర్తాన్ని ఎంచుకోవడం వెనుక రెండు బలమైన కారణాలు ఉన్నట్లు రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. ఒకటి రేవంత్ కు కలిసొచ్చే లక్కీ నెంబరు 9 కావడం అయితే రెండోది మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే తప్ప కేసిఆర్ కు ఉన్న 2 ఎంపి సీట్లతో తెలంగాణ రాలేదన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు మరోసారి గుర్తు చేయడం కోసమే ఈ తేదీని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో రోజురోజుకూ మసకబారిపోతున్న కాంగ్రెస్ పార్టీలో వెలుగులు నింపేందుకే రేవంత్ ఈ స్ట్రాటజీ ఎంచుకున్నట్లు చెబుతున్నారు. కేసిఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసం చేస్తే... రేవంత్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి బాహుబలి రూపంలో ఆదుకునేందుకు చేరుతున్నారని రేవంత్ అనుచరవర్గం చెబుతున్నమాట. కాంగ్రెస్ లోకి బాహుబలి వస్తాడు అంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు నెలకొన్న తరుణంలో అసలైన మహేంద్ర బాహుబలి రూపంలో రేవంత్ కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాడన్న ప్రచారం మొదలైంది. జానారెడ్డి మొదలుకొని కాంగ్రెస్ సీనియర్లంతా బాహుబలి వస్తేనే కాంగ్రెస్ పార్టీ గట్టెక్కుతందన్న ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారంతా రేవంత్ రెడ్డి కోసమే ఎదురుచూశారన్న మాటలు వినిపిస్తున్నాయి.

మంగళవారం ఢిల్లీలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో ఎప్పుడు చేరేది. రేవంత్ ఏ పదవిలో కొనసాగుతారన్నదానిపై చర్చలు జరిపినట్లు తెలిసింది. రాహుల్ భేటీ తర్వాత రేవంత్ పార్టీ మార్పుపై మీడియాలో కథనాలొచ్చాయి. అయితే పార్టీ మారే విషయాన్ని రేవంత్ ఖండించారు. తాను టిడిపిలోనే ఉంటానని, పుకార్లు నమ్మరాదంటూ ప్రకటన జారీ చేశారు. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం రేవంత్ డిసెంబరు 9న పార్టీ మారడం ఖాయమైపోయిందని జనాల్లోకి సమాచారం వెళ్లిపోయింది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అర్జున్ రెడ్డి హీరోలా బిహేవ్ చేసిన మేడ్చల్ మెడికో లు

https://goo.gl/zrDApr

 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?