తెలంగాణలో భూముల విలువ పెంపు.. కేసీఆర్ ఆమోదమే తరువాయి

By Siva KodatiFirst Published Jun 29, 2021, 5:08 PM IST
Highlights

రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరించాలని తెలంగాణ కేబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదించింది. దీంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా భూములు, ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఏపీలో 11 శాతం, తమిళనాడులో 7.5 శాతం, మహారాష్ట్రలో 7 శాతంగా రిజిస్ట్రేషన్ విలువ వుంది.

రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరించాలని తెలంగాణ కేబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదించింది. దీంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా భూములు, ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఏపీలో 11 శాతం, తమిళనాడులో 7.5 శాతం, మహారాష్ట్రలో 7 శాతంగా రిజిస్ట్రేషన్ విలువ వుంది. గడిచిన ఎనిమిదేళ్లుగా తెలంగాణలో రిజిస్ట్రేషన్ విలువలు పెరగలేదు. ఇందుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ త్వరలోనే కేసీఆర్‌కు నివేదిక అందజేయనుంది. 

రిజిస్ట్రేషన్ రేట్లు పెంచడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏడాది రూ.3,400 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ఆమోదం తర్వాత ఈ ఏడాది ఆగష్టు 1 నుంచే అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి.

ఇక రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియ శాస్త్రీయ పద్దతిలో నిర్దారించే దిశలో కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జరిగిన రిజిస్ట్రేషన్‌ లావాదేవీల సగటును తీసుకుని లెక్కలు కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా జాతీయ, రాష్ట్ర, అంతర్‌ జిల్లా రహదారులు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలను బట్టి విలువలను నిర్ధారించినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.

click me!