ఈటల ఎఫెక్ట్... హుజురాబాద్ పై మంత్రి నిరంజన్ రెడ్డి వరాలు

By Arun Kumar PFirst Published Jun 29, 2021, 5:07 PM IST
Highlights

మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు పలు హామీలిచ్చారు. 

హుజురాబాద్: టిఆర్ఎస్ కు కమలాపూర్ కంచు కోట... ఇందుకోసం ఈటల రాజేందర్ చేసిందేమీ లేదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రేపు రాబోయే తెలంగాణ ఫలితాలకు హుజురాబాద్ వేదిక కాబోతుందన్నారు. కాబట్టి ఒక్కరు కూడ తప్పు చేయవద్దని... టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మంత్రి. 

మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గోదాములతో పాటు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హుజురాబాద్ ప్రజలకు హామీ ఇచ్చారు. 

''రైతు బంధు ఓ అద్భుతమైన కార్యక్రమం. వ్యవసాయ శాఖ మంత్రిగా హుజురాబాద్ లో కాలు మోపడం సంతోషంగా ఉంది. అత్యధిక మందికి ఆహారం అందించేది, ఉపాధి ఇచ్చేది వ్యవసాయ రంగం. తెలంగాణలో వ్యవశాయ రంగాన్ని బలోపితం చేయడం వల్లే అభివృద్ది సాధ్యం అవుతుంది. రైతుల ఉత్పత్తి మొత్తం ఈ సమాజానికి ఉపయోగ పడుతుంది'' అన్నారు. 

read more  కరీంనగర్ సిగలో తీగలమణిహారం... తుది దశకు కేబుల్ బ్రిడ్జీ పనులు...(వీడియో)

''కరోనా కష్ట కాలంలో కూడe రైతు బంధు, కొనుగోళ్ల విషయంలో ఏ మాత్రం వెనుక అడుగు వేయలేదు. 60లక్షల 80వేల మంది రైతులకు రైతు బందు ఇచ్చాం. వీరిలో 6వేల మంది మాత్రమే 24ఎకరాల పైబడి భూమి ఉన్న వారు. 30-40ఏళ్లలో రైతులను ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేశారు'' అని పేర్కొన్నారు. 

''ప్రపంచంలో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు గొప్పవి. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం అంటే మాటలు కాదు. ఢిల్లీ ఇంజనీరింగ్ ఆధికారులు పరేషాన్ ఆయ్యారు'' అని నిరంజన్ రెడ్డి తెలిపారు. 

''రాష్ట్రాల నుండి టాక్స్ లు వెళ్లడమే తప్ప, కేంద్రం నుండి ఇటు వచ్చేది లేదు. రూ.2 కిలో బియ్యం ఇస్తామంటే ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి చేసిన పేదరిక రాష్ట్రం మనది. ఇప్పుడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్న రాష్ట్రం  తెలంగాణ'' అని మంత్రి పేర్కొన్నారు. 

 

click me!