మూసీలో ముంచి కేటీఆర్ కు సన్మానం చేయాలని ఉంది.. రేవంత్ రెడ్డి

By AN TeluguFirst Published Jun 29, 2021, 3:56 PM IST
Highlights

అందంగా ఉన్న హైదరాబాద్ చెత్త నగరంగా మారిందని.. 16 నివాసయోగ్యమైన పట్టణ గుర్తింపులో హైదరాబాద్ కు స్థానం రాలేదంటే ఎంత చెత్తగా కేటీఆర్ పరిపాలన సాగుతుందో అర్థం చేసుకోవాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.  మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేరే రాష్ట్రంలో జరిగిన ఓ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు.

ఓ కాంట్రాక్టర్ మోరీలలో  చెత్త తీయకపోవడంతో మొత్తం మురుగునీరు, చెత్త రోడ్డు పై నిలిచిపోవడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  దీంతో స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్ ని పిలిపించి ఆ మురుగు నీటిలో కూర్చోబెట్టి అతనిపై చెత్త వేయించారని చెప్పారు.

అని ఆ విధంగా మంత్రి కేటీఆర్ కు సన్మానం చేయాలని ఉంది అని రేవంత్ అన్నారు. అయితే మంత్రి భద్రత మధ్య ఉన్నారు కాబట్టి చేయలేకపోతున్నాం అన్నారు.  మంత్రి కేటీఆర్ ను మూసీలో నడుము లోతు లో నాలుగు గంటలు  ఉంచితే అప్పుడు పేద ప్రజల సమస్యలు అర్థమవుతాయని, ఏదో ఒకరోజు ఆ పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.

 హైదరాబాద్ పూర్తిగా చెత్త నగరంగా మారిందని దీనిపైన, నగరంలో ప్రజా సమస్యలపై పూర్తిస్థాయిలో పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
 
click me!