ఇకపై దిక్కులు చూడం.. మా పని మేం చేసుకుంటాం , ఆ తర్వాతే పొత్తులు : ప్రొ.కోదండరాం సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jun 18, 2023, 06:21 PM IST
ఇకపై దిక్కులు చూడం.. మా పని మేం చేసుకుంటాం , ఆ తర్వాతే పొత్తులు : ప్రొ.కోదండరాం సంచలన వ్యాఖ్యలు

సారాంశం

దిక్కులు చూడటం మానేసి.. మా పని మేం చేసుకుంటామని, ఆ తర్వాతే పొత్తులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఈ నెల 21 నుంచి యాత్ర చేస్తున్నానని.. తెలంగాణ పరిరక్షణ సదస్సులు నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. కేసీఆర్ వచ్చాకా రాజకీయాలు కార్పోరేట్‌గా మారాయన్నారు. నిరంకుశ పాలనను ప్రజల మీద రుద్దుతున్నారని.. అధికారాన్ని , డబ్బును ఉపయోగిస్తున్నారని కోదండరామ్ ఆరోపించారు. తెలంగాణ జన సమితి వుంటుందని.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ తన అధికారాన్ని ఆస్తులను పెంచుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నారని కోదండరాం ఆరోపించారు. ఈ నెల 21 నుంచి యాత్ర చేస్తున్నానని.. తెలంగాణ పరిరక్షణ సదస్సులు నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. 

ఉద్యమంలో తనతో పాటు కలిసి వచ్చిన అందరినీ ఏకం చేస్తామని కోదండరామ్ వెల్లడించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో దోపిడీకి గురికాని ఊరే లేదన్నారు. పంట నష్టపోయిన వారికి రూ.10 వేలు వెంటనే విడుదల చేయాలని , ధరణి పోర్టల్‌లో లోపాలను సరిదిద్దాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. కొట్లాడటమే మా అజెండా అని కోదండరామ్ స్పష్టం చేశారు. దిక్కులు చూడటం మానేసి.. మా పని మేం చేసుకుంటామని, ఆ తర్వాతే పొత్తులు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ALso Read: ఏ నిర్ణయానికైనా సిద్ధం.. అవసరమైతే మా పార్టీని విలీనం చేస్తాం : కోదండరాం సంచలన వ్యాఖ్యలు

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు.  వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా వున్నామన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం లేదని.. తెలంగాణను వదిలి దేశ రాజకీయాల్లోకి వెళ్లడం సరికాదన్నారు. రాజకీయ స్వలాభం కోసమే కేసీఆర్ అడుగులు వేస్తున్నారని.. తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం టీజేఎస్‌తోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ శక్తులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటామని.. అవసరమైతే తమ పార్టీని విలీనం చేస్తామని కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి నిర్ణయానికైనా తాము వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కోదండరాం వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు