వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎస్‌ఐ దుర్మరణం..

Published : Jun 18, 2023, 05:04 PM IST
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎస్‌ఐ దుర్మరణం..

సారాంశం

వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) మృతిచెందారు.

వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) మృతిచెందారు. ఎస్‌ఐ ప్రయాణిస్తున్న కారు చెట్టుకు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. గీసుకొండ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన సోమ కుమారస్వామి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు.  కుమారస్వామి ఆదివారం రోజున కొత్తగూడెం నుంచి వరంగల్‌కు వస్తుండగా.. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిలో గీసుకొండ మండలంలోని హర్జితండా వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమారస్వామి మృతిచెందారు. 

అయితే ప్రమాదానికి గమనించిన వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుమారస్వామి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుమారస్వామి మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు