
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వేగంగా అడుగులు వేస్తుండటం.. ఏ క్షణమైనా అసెంబ్లీ రద్దు నిర్ణయం వెలువడే అవకాశం ఉండటంతో... రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా కేసీఆర్ పట్ల ఆగ్రహంతో రాజకీయ పార్టీని స్థాపించిన ప్రొఫెసర్ కోడండరామ్... ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ఎలాగైనా షాకివ్వాలని నిర్ణయించారు.
దీనిలో భాగంగా పార్టీ నేతలు, మేధావులు, విద్యార్థి సంఘాల నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. 25 నియోజకవర్గాల్లో ఇంటింటికి జనసమితి కార్యక్రమాన్ని ప్రారంభించామని.. అన్ని జిల్లాల్లో నిరుద్యోగ సదస్సులు నిర్వహిస్తామని కోదండరామ్ తెలిపారు. ఎన్నికల గుర్తు కోసం ఎలక్షన్ కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నామని.. అయితే గుర్తు ఏదనేది ఇంకా నిర్ణయించలేదని తెలిపారు.