తెలంగాణ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుల చెరోదారి

By sivanagaprasad KodatiFirst Published Sep 5, 2018, 12:23 PM IST
Highlights

తెలంగాణలో ఎన్నికల సమరం మొదలుకానుండటంతో పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక, నిధుల సమీకరణ వంటి వాటితో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి.

తెలంగాణలో ఎన్నికల సమరం మొదలుకానుండటంతో పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక, నిధుల సమీకరణ వంటి వాటితో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇక పొత్తుల విషయానికి వచ్చేసరికి సీపీఐ, సీపీఎం కలిసి పనిచేస్తాయా..? ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నాయి అనే చర్చకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తెరదించాయి.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సీపీఐ, సీపీఎం రెండు పార్టీలు విడివిడిగానే పోటి చేసే అవకాశం కనిపిస్తోంది. తొలుత కలిసి పనిచేద్దామని.. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కలిసివచ్చే వారిని కలుపుకుపోతామన సీపీఐ.. సీపీఎం ముందు ప్రతిపాదించింది. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్  కనుక ఉంటే తాము కలవమని సీపీఎం తేగేసి చెప్పింది. ఆ పార్టీ బీఎల్‌ఎఫ్‌తో ఇప్పటికే జట్టు కట్టగా.. జనసేనతో చర్చలు జరుపుతోంది. రెండు పార్టీలు ఏయే పార్టీలతో జత కడతాయో కొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.

click me!