హుస్నాబాద్ కేసీఆర్‌కు కలిసొచ్చిన ప్రాంతం..ఈసారి గెలుపు మాదే: హరీశ్

Published : Sep 05, 2018, 12:58 PM ISTUpdated : Sep 09, 2018, 12:42 PM IST
హుస్నాబాద్ కేసీఆర్‌కు కలిసొచ్చిన ప్రాంతం..ఈసారి గెలుపు మాదే: హరీశ్

సారాంశం

గత ఎన్నికల్లో కేసీఆర్ ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి... అధికారాన్ని అందుకున్నారని.. ఈసారి కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నందును గెలుపు ఖాయమన్నారు మంత్రి హరీశ్ రావు

గత ఎన్నికల్లో కేసీఆర్ ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి... అధికారాన్ని అందుకున్నారని.. ఈసారి కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నందును గెలుపు ఖాయమన్నారు మంత్రి హరీశ్ రావు. హుస్నాబాద్‌లో జరగునున్న ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభ రద్దు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకుంటారని.. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని హరీశ్ అన్నారు. ప్రగతి నివేదన సభలో నాలుగేళ్లలో ఏం సాధించామో తెలిపామని.. ప్రజా ఆశీర్వాద సభలో రాబోయే ఐదేళ్ల కాలంలో ఏం చేయబోతున్నామో ప్రజలకు వివరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

కాంగ్రెస్  పార్టీకి పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా దొరకడం లేదని.. ఖచ్చితంగా 100 స్థానాలు గెలిచి తిరిగి అధికారాన్ని చేపడతామని హరీశ్ రావ్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కేసీఆర్ తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu