ముందస్తు ఎన్నికలు వద్దు...సీఈసీ కి టీజేఎస్ ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Sep 26, 2018, 7:53 PM IST
Highlights

తెలంగాణలో అసెంబ్లీ రద్దవడంతో ముందస్తు ఎన్నికల కోసం పార్టీలన్నీ సిద్దమవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అయితే ఏకంగా తమ పార్టీ తరపున అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే కొన్ని ప్రతిపక్ష పార్టీలు మాత్రం ముందస్తు ఎన్నికలకు నో చెబుతున్నారు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ముందస్తును వ్యతిరేకిస్తుండగా తాజాగా ఈ లిస్ట్ లో తెలంగాణ జన సమితి  చేరింది. 

తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు కాకుండా ఎప్పటిమాదిరిగానే సాధారణ ఎన్నికలు నిర్వహించాలని టీజేఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది. తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ వున్నా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లడంలో స్వార్థం, కుట్ర దాగివున్నాయని టీజేఎస్ నాయకులు దిలీప్ ఆరోపించారు. అందువల్ల 2019 లోనే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

అలాగే నవంబర్, డిసెంబర్లలో ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తే దాదాపు 10 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని ఈసీకి టీజేఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

click me!