పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ప్రారంభమైతే కేసీఆర్ రాజీనామా చేయాలి: ఉత్తమ్

By narsimha lodeFirst Published May 13, 2020, 1:23 PM IST
Highlights

పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ప్రారంభమైతే తెలంగాణ సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్:పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ప్రారంభమైతే తెలంగాణ సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.పోతిరెడ్డిపాడుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం నాడు ఇవాళ దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంఘీభావం తెలిపారు.

also read:పోతిరెడ్డిపాడుపై వివాదాస్పద జీవోలు: నాడు వైఎస్ఆర్, నేడు జగన్
ఏపీ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ కు టీఆర్ఎస్ ఫండింగ్ ఏర్పాటు చేసిందన్నారు. అప్పటి నుండి కేసీఆర్, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని విస్తరిస్తే తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్టేనని చెప్పారు. కేసీఆర్ అసమర్ధత వల్లో, నిర్లక్ష్యం వల్లో ఇంకా ఏ కారణం వల్లో ఏపీ ప్రభుత్వం ఈ విస్తరణ పనులను ప్రారంభించేందుకు సిద్దంగా ఉందని ఆయన ఆరోపించారు. జగన్ తో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా ఈ పనులు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చిందో తెలియదని ఆయన ఆరోపించారు.

పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను ప్రారంభించిన రోజునే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీళ్లలో అన్యాయం జరిగిందనే డిమాండ్ తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు.

also read:పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల దీక్ష

తెలంగాణకు అన్యాయం జరిగితే చరిత్రలో కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగులుతారన్నారు. ఈ విషయమై కేసీఆర్ ఎందుకు ప్రకటన చేయలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఉమ్మడి రాష్ట్రంలో మర్రి శశిదర్ రెడ్డి, పీజేఆర్ లు 11,500 నుండి 40 వేల క్యూసెక్కులకు పెంచిన రోజునే వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచితే నల్గొండ, మహాబూబ్ నగర్ లు ఎండిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎక్కువ నీటిని వినియోగించుకొంటుందని ఆయన ఆరోపించారు.
 

click me!